Abn logo
Sep 28 2021 @ 03:02AM

కొత్తగా 618 కేసులు.. 6 మరణాలు

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,069 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 618 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వైరస్‌ కారణంగా మరో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,47,459కి, మరణాల సంఖ్య 14,142కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 12,482 యాక్టివ్‌ కేసులున్నాయి.