ట్యూబుల మధ్య ఉన్న నా కుమారుడిని కాపాడండి ప్లీజ్....

ABN , First Publish Date - 2020-11-21T17:14:58+05:30 IST

"నా కుటుంబాన్ని ప్రతి దశలోనూ కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని, చక్కగా చదువుకుని మాకంటే మంచి జీవితం గడపాలని నా భార్య జ్యోతి, నేను

ట్యూబుల మధ్య ఉన్న నా కుమారుడిని కాపాడండి ప్లీజ్....

"నా కుటుంబాన్ని ప్రతి దశలోనూ కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని, చక్కగా చదువుకుని మాకంటే మంచి జీవితం గడపాలని నా భార్య జ్యోతి, నేను ఎంతో ముందుగానే ఎన్నో ఆలోచనలు చేశాము. కానీ, ఇప్పుడు ఆసుపత్రిలో నా పసివాడు ప్రతి శ్వాసకూ విలవిలలాడిపోతున్నాడు. విరామం లేని ఈ వేదన మాకే ఎందుకు?..." అని ఆవేదన చెందుతున్నారు ఆ బాలుడి తండ్రి లింగం.


బార్బర్‌గా పనిచేస్తున్న లింగం, తన భార్య జ్యోతితో కలసి హైదరాబాదులో నివసిస్తున్నారు. ఈ మధ్యనే జ్యోతి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్లిన వెంటనే ఆమెను డాక్టర్లు పరీక్షించి అత్యవసరంగా LSCS ప్రొసీజర్ చెయ్యాలని నిర్ణయించారు.


ఆ సమయంలో అత్యంత బాధతో విలవిలలాడిపోతున్న జ్యోతిని చూసి ఏం జరుగుతోందో అర్థంకాని అయోమయ స్థితికి భర్త లింగం గురయ్యారు. జ్యోతికి LSCS ప్రొసీజర్ పూర్తయిన తర్వాత డాక్టర్లు వచ్చి ఆమెకు నెలలు నిండకపోయినప్పటికీ ప్రసవం చెయ్యాలని, శిశువును నిరంతరం గమనిస్తూ తగిన చికిత్స అందించేందుకు NICUకి తరలించాలని చెప్పారు.


"నా కొడుకును ఆ పరిస్థితిలో చూసినప్పుడు నా గుండె చెదిరిపోయింది. అప్పుడు నాకు ఛాతీలో ఉన్నట్టుండి నొప్పి మొదలైంది. గుండెలు పగిలేంతగా ఏడవాలనిపించింది. మాకు ఎదురైన ఇలాంటి హేయమైన పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదు" అని తన కొడుకును చూస్తూ జ్యోతి నిర్వేదంగా పలికింది.


విరాళాలు ఇవ్వదలిచే వారు ఇక్కడ క్లిక్‌ చేయండి


ప్రస్తుతం జ్యోతి కొడుకు ట్యూబుల మధ్య వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నాడు.


లింగం, జ్యోతి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. లింగం తను సంపాదించిన కొద్దిపాటి సొమ్ము భార్యకు చికిత్స కోసం ఖర్చుపెట్టాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదు. ప్రస్తుతం వీరి కొడుకు పూర్తిగా కోలుకోవడానికి మరో 2 లేదా 3 వారాల పాటు NICUలోనే ఉండాలన్నారు. ఈ చికిత్స కొనసాగాలంటే ఈ నిరుపేద తల్లిదండ్రులకు అదనంగా రూ.12 లక్షలు (16,176 డాలర్లు) అవసరం.


ఈ నిరుపేద కుటుంబానికి మీ అండ కావాలి.


తమ పేదరికం కారణంగా ఎన్నో బాధలు భరించిన ఈ కుటుంబం ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. కానీ, ఇప్పుడు తమ చిన్నారి శిశువు జీవితం కోసం పోరాడుతుంటే, ఆ పసి ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.


ఇప్పుడు లింగం, జ్యోతి దంపతుల ప్రాణానికి ప్రాణమైన పసివాడిని మీ సహాయం మాత్రమే కాపాడగలుగుతుంది. విశాల హృదయంతో మీరిచ్చే విరాళాలే ఆ చిన్నారికి మెరుగైన చికిత్సను అందించి నిండైన జీవితాన్ని ఇస్తాయి. దయచేసి ఉదారంగా విరాళాలివ్వండి...


విరాళాలు ఇవ్వదలిచే వారు ఇక్కడ క్లిక్‌ చేయండి


Updated Date - 2020-11-21T17:14:58+05:30 IST