Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ కుక్క దేనినో కరచుకుని పరిగెడుతోంది.. అనుమానంతో దగ్గరకు వెళ్లిన స్థానికులు దానిని చూసి కొయ్యబారిపోయారు!

రాజస్థాన్‌లోని బికనేర్ పరిధిలో గల నయాషహర్ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కగా ఒక నవజాత శిశువు మృతదేహం లభ్యమయ్యింది. ఈ మృతదేహాన్ని ఒక పిచ్చికుక్క పీక్కుతింటోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువు మృతదేహాన్ని పీబీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయాషహర్ పోలీస్ స్టేషన్ కు కొద్దిదూరంలో రోడ్డుపై పిచ్చికుక్క తన నోటితో ఒక మృతదేహాన్ని పట్టుకుని పరిగెడుతోంది. 

 దీనిని గమనించిన స్థానికులు.. కుక్క ఏదో జంతువును నోట కరచుకుని వెళుతున్నదని భావించారు. అయితే ఆ తరువాత పరిశీలనగా చూడగా, అది నవజాత శిశువు మృతదేహమని గుర్తించారు. వెంటనే ఆ కుక్కను తరిమికొట్టి, శిశువు మృతదేహాన్ని అక్కడే ఉంచి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రాత్రివేళ ఎవరో ఈ మృతదేహాన్ని ఇక్కడ పడవేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మృతదేహం ఆడశిశువుది కాగా, బొడ్డుతాడు కట్ చేయకుండా అలానే ఉండటం విశేషం. దీంతో ఈ శిశువు డెలివరీ ఇంటిలోనే జరిగి ఉంటుందని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని వారిని విచారిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement