Abn logo
Sep 21 2021 @ 09:10AM

New Zealand: మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు

అక్లాండ్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో మహిళా జట్టు చుట్టూ భద్రతను పెంచారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరగనున్న క్రికెట్ మ్యాచ్ సందర్భంగా లీసెస్‌టర్‌షైర్‌లోని ఆప్టోన్‌స్టీల్ కౌంటీ గ్రౌండ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని న్యూజిలాండ్ ప్రతినిధి చెప్పారు. న్యూజిలాండ్ మహిళా జట్టు బస చేసిన హోటల్ వద్ద, వారు మ్యాచ్ ఆడే గ్రౌండ్లలోనూ భద్రతను పెంచారు. 

ఇవి కూడా చదవండిImage Caption