Advertisement
Advertisement
Abn logo
Advertisement

విదేశీ ప్రయాణికులకు New Zealand గుడ్ న్యూస్.. ఏప్రిల్ 30 నుంచి..

ఎన్నారై డెస్క్: కరోనా నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తమ దేశ పౌరుల కోసం న్యూజిలాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చిక్కుకున్న న్యూజిలాండ్ పౌరులు.. స్వదేశంలోకి అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణికులకు కూడా న్యూజిలాండ్ తీపి కబురు చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్నీ తమ సరిహద్దులను మూసేసిన విషయం తెలిసిందే. అయితే దాని ఉధృతి కాస్త తగ్గిన తర్వాత ఆర్థిక తదితర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలను సడలించాయి. కానీ న్యూజిలాండ్ మాత్రం.. ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న న్యూజిలాండ్ పౌరులను స్వదేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతించింది. ఆస్ట్రేలియాలో ఉన్న న్యూజిలాండ్ పౌరులు.. జనవరి 16 నుంచి స్వదేశానికి రావొచ్చని పేర్కొంది. మిగిలిన దేశాల్లో ఉన్న న్యూజిలాండ్ పౌరులు.. ఫిబ్రవరి 13 నుంచి దేశంలోకి అడుగుపెట్టొచ్చని వెల్లడించింది.  అంతేకాకుండా.. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ ప్రయాణికులు ఏప్రిల్ 30 నుంచి న్యూజిలాండ్‌కు రావొచ్చని వివరించింది. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement