తన బిడ్డ తండ్రినే పెళ్లి చేసుకోబోతున్న న్యూజిలాండ్ ప్రధాని!

ABN , First Publish Date - 2021-05-06T16:48:15+05:30 IST

న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్ అయిపోయింది. ఈ ఏడాది వేసవిలో జసిండా వివాహం జరగబోతోంది.

తన బిడ్డ తండ్రినే పెళ్లి చేసుకోబోతున్న న్యూజిలాండ్ ప్రధాని!

న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్ అయిపోయింది. ఈ ఏడాది వేసవిలో జసిండా వివాహం జరగబోతోంది. ఈ పెళ్లికి పిలవాల్సిన అతిథులు జాబితా పూర్తయ్యాక వివాహ తేదీని అధికారికంగా వెల్లడిస్తారట. ప్రధానిగా ఉండగానే జసిండా ఓ చిన్నారికి జన్మనిచ్చారు. ఆ చిన్నారికి నీవ్ తియారహ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ బాలిక వయసు రెండేళ్లు. 


తన బాయ్‌ఫ్రెండ్ క్లార్క్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్న సమయంలోనే నీవ్‌కు జసిండా జన్మనిచ్చారు. త్వరలో అతడినే జసిండా వివాహం చేసుకోబోతున్నారు. వెల్లింగ్టన్‌లోని ప్రధాని అధికార నివాసం `ప్రీమియర్‌ హౌస్‌`లో తల్లీకూతుళ్లతో కలిసి క్లార్క్‌ కూడా ఉంటున్నారు. ప్రస్తుతానికి జసిండాకు `డొమెస్టిక్‌ పార్ట్‌నర్‌`గా ఉన్న క్లార్క్ త్వరలోనే భర్త హోదాలోకి మారబోతున్నారు. నిజానికి 2019 ఈస్టర్‌ సెలవుల్లోనే జసిండా, క్లార్క్‌ల నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. న్యూజిలాండ్‌లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ సమయంలోనే వీరి పెళ్లి ఉంటుందని సమాచారం. 

Updated Date - 2021-05-06T16:48:15+05:30 IST