శ్రీకృష్ణుడి సన్నిధిలో న్యూజిలాండ్ ప్రధాని.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-08-10T01:01:19+05:30 IST

న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్.. ఆక్లాండ్‌ నగరంలోని రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అంతేకాకుండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూ

శ్రీకృష్ణుడి సన్నిధిలో న్యూజిలాండ్ ప్రధాని.. వీడియో వైరల్!

న్యూజిలాండ్: న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్.. ఆక్లాండ్‌ నగరంలోని రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అంతేకాకుండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆమె తాజాగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జసిండా అర్డెర్న్.. తాజాగా ఆక్లాండ్‌ నగరంలోని రాధాకృష్ణ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. తర్వాత పూరీ, చోలే, దాల్‌తో కూడిన భోజనం చేశారు. న్యూజిలాండ్ ప్రధాని.. పూజాకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు.. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి. కాగా.. న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసిన జసిండా అర్డెర్న్.. ప్రజలు మనసు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు 1569 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. 


Updated Date - 2020-08-10T01:01:19+05:30 IST