కరోనా బాధితుల పేర్లు వెల్లడించిన న్యూజిలాండ్ ఎంపీ.. నైతిక బాధ్యత వహిస్తూ!

ABN , First Publish Date - 2020-07-09T08:01:42+05:30 IST

కరోనా బాధితుల వివరాలు బహిర్గతం చేసినందుకుగాను ఓ ఎంపీ రాజీనమా చేసిన ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్సర్వేటివ్ ప్రతి

కరోనా బాధితుల పేర్లు వెల్లడించిన న్యూజిలాండ్ ఎంపీ.. నైతిక బాధ్యత వహిస్తూ!

వెల్లింగ్టన్: కరోనా బాధితుల వివరాలు బహిర్గతం చేసినందుకుగాను ఓ ఎంపీ రాజీనమా చేసిన ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్సర్వేటివ్ ప్రతిపక్ష నేత హమీష్ వాకర్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనా బారినపడిన వారి పేర్లను వెల్లడించారు. అయితే కరోనా బాధితుల పేర్లను మీడియా సంస్థలు ప్రచురించకపోయినప్పటకీ.. హమీష్ వాకర్‌ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆయన.. తప్పు ఒప్పుకున్నారు. అంతేకాకుండా అందుకు బాధ్యత వహిస్తూ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. కాగా.. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు 1563 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-09T08:01:42+05:30 IST