న్యూజిల్యాండ్‌లో ఎన్నికలు వాయిదా..?

ABN , First Publish Date - 2020-08-13T04:40:36+05:30 IST

దాదాపు వంద రోజుల పాటు ఒక్కకరోనా కేసు కూడా వెలుగులోకి రాకపోవడంతో ఇటీవల న్యూజిల్యాండ్‌లో చిన్న ఆశ చిగురించింది.

న్యూజిల్యాండ్‌లో ఎన్నికలు వాయిదా..?

వెల్లింగ్టన్: దాదాపు వంద రోజుల పాటు ఒక్కకరోనా కేసు కూడా వెలుగులోకి రాకపోవడంతో ఇటీవల న్యూజిల్యాండ్‌లో చిన్న ఆశ చిగురించింది. అయితే సరిగ్గా రెండు రోజుల తరువాత మరో కరోనా కేసు బయటపడటంతో ఆ దేశం ఉలిక్కిపడింది. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై కూడా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల వాయిదా తప్పదనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేద్దామనుకున్న ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డర్న్ తన నిర్ణయాన్ని మరో వారానాని వాయిదా వేయడమే ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది. కరోనా మహమ్మారి మరోమారు బుసలు కొడుతున్న నేపథ్యంలో శాసనసభకు కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయకలగ కూడాదనే ఉద్దేశ్యంతో రద్దు నిర్ణయాన్ని వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-08-13T04:40:36+05:30 IST