అబుదాబి, T20 తొలి సెమీఫైనల్: 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 20 పరుగులు చేసింది. 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టుపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 167 పరుగులు చేయాల్సి ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం షేక్ జాయెద్ స్టేడియంలో తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.