Food Delivery App తో ప్రాణాలను దక్కించుకున్న మహిళ.. తనను బంధించిన వారికి అస్సలు డౌట్ రాకుండా..

ABN , First Publish Date - 2022-06-25T01:05:02+05:30 IST

అపాయంలో పడిన ఓ న్యూయార్క్ మహిళ ఉపాయంతో సమస్య నుంచి బయటపడింది.

Food Delivery App తో ప్రాణాలను దక్కించుకున్న మహిళ.. తనను బంధించిన వారికి అస్సలు డౌట్ రాకుండా..

అపాయంలో పడిన ఓ న్యూయార్క్ మహిళ ఉపాయంతో సమస్య నుంచి బయటపడింది. ఒక వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురై బందీగా మారిన మహిళ ఫుడ్ డెలివరీ యాప్ సహాయంతో తప్పించుకుంది. న్యూయార్క్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ ఇంట్లోకి జొరబడిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె నుంచి ఫోన్ లాక్కుని ఆమెను బంధించాడు. బుధవారం ఉదయం ఆమెకు ఫోన్ తిరిగి ఇచ్చి ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయాల్సిందిగా కోరాడు. 


ఇది కూడా చదవండి..

లేడీ కాదు కిలేడీ.. ఈమె ఫ్రొఫైల్ పిక్‌తో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అస్సలు ఓకే చేయకండి.. లేకుంటే ఈ 49 మంది ఎదుర్కొన్న పరిస్థితే..


ఆ మహిళ ఒక బర్గర్, శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. దానితో పాటుగా `దయచేసి పోలీసులను పిలవండి..` అని మెసేజ్ చేసింది. డెలివరీ బాయ్‌తో పాటే పోలీసులు రావాలని కోరింది. ఆ మెసేజ్ చదివిన డెలివరీ బాయ్.. దాని గురించి రెస్టారెంట్ యజమానికి చెప్పాడు. యజమాని వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించాడు. డెలీవరీ బాయ్‌తో పాటు ఆ అడ్రస్‌కు వెళ్లిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, నాలుగు రోజుల క్రితమే మరో మహిళ అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. 

Updated Date - 2022-06-25T01:05:02+05:30 IST