డాక్టర్ దగ్గర ఏడ్చినందుకు రూ.3000.. బిల్లు చూసి కంగుతిన్నపేషెంట్..నెట్టింట పేలుతున్న సెటైర్లు!

ABN , First Publish Date - 2022-05-22T01:25:20+05:30 IST

చికిత్స తీసుకునే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైందనే కారణంతో ఓ ఆసుపత్రి భారీ మొత్తంలో చార్జి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిసిప్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపట్ల నెటిజన్లు ఫన్నీగా రి

డాక్టర్ దగ్గర ఏడ్చినందుకు రూ.3000.. బిల్లు చూసి కంగుతిన్నపేషెంట్..నెట్టింట పేలుతున్న సెటైర్లు!

ఎన్నారై డెస్క్: చికిత్స తీసుకునే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైందనే కారణంతో ఓ ఆసుపత్రి భారీ మొత్తంలో చార్జి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిసిప్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపట్ల నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ కొంత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లి, డాక్టరును సంప్రదించింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. ట్రీట్‌మెంట్ చేస్తున్న సమయంలో సదరు మహిళ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. ఈ నేపథ్యంలో చికిత్స పూర్తైన తర్వాత ఆసుపత్రి సిబ్బంది అందించిన బిల్ చూసి బిత్తరపోయింది. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో ఏడ్చినందుకుగాను 40డాలర్ల (సుమారు రూ.3వేల) బిల్లు వేయడంతో కంగుతింది. అయితే చేసేదేమీ లేక ఆ మొత్తాన్ని చెల్లించేసింది. తాజాగా ఆ రిసిప్ట్‌ను ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-22T01:25:20+05:30 IST