అమెరికా పౌరసత్వం లేకపోయినా ఓటు హక్కు

ABN , First Publish Date - 2022-01-10T12:53:32+05:30 IST

అమెరికా పౌరసత్వం లేని వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ న్యూయార్క్‌ సిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా పౌరసత్వం లేకపోయినా ఓటు హక్కు

న్యూయార్క్‌: అమెరికా పౌరసత్వం లేని వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ న్యూయార్క్‌ సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగనున్న న్యూయార్క్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కొత్త చట్టానికి ఆమోదముద్ర వేశారు. ఇమ్మిగ్రెంట్స్‌కు కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని సిటీ కౌన్సిల్‌ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటున్నా పౌరసత్వం లేని సుమారు 8 లక్షల మంది ‘డ్రీమర్లు’ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Updated Date - 2022-01-10T12:53:32+05:30 IST