ట్రంప్ ఆమోదించినా.. మరోసారి రివ్యూ చేస్తాం: న్యూయార్క్ గవర్నర్

ABN , First Publish Date - 2020-09-25T10:11:01+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

ట్రంప్ ఆమోదించినా.. మరోసారి రివ్యూ చేస్తాం: న్యూయార్క్ గవర్నర్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏ వ్యాక్సిన్‌ను ఆమోదించినా సరే.. ఆ వ్యాక్సిన్‌పై మరోమారు రివ్యూ నిర్వహిస్తామని న్యూయార్క్ ప్రభుత్వం చెబుతోంది. ‘ట్రంప్ ప్రభుత్వ అభిప్రాయాలపై నాకు నమ్మకం లేదు. ట్రంప్ ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఆమోదించి సురక్షితం అని చెప్పినా న్యూయార్క్ ప్రభుత్వం స్వంతంగా రివ్యూ నిర్వహిస్తుంది’ అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. 


ఎన్నికల్లో మరోమారు గెలిచేందుకు ట్రంప్ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరోపక్క అమెరికాలోని మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు విముఖంగా ఉన్నట్టు ఇటీవల పోల్స్‌లో తేలింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 71,79,057 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 2,07,401 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-09-25T10:11:01+05:30 IST