కరోనా ఎఫెక్ట్.. న్యూయార్క్‌లో రోడ్డెక్కనున్న రెస్టారెంట్‌లు!

ABN , First Publish Date - 2020-09-26T23:10:12+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కోట్లాది మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.

కరోనా ఎఫెక్ట్.. న్యూయార్క్‌లో రోడ్డెక్కనున్న రెస్టారెంట్‌లు!

న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కోట్లాది మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో కొంత మంది రెస్టారెంట్ యజమానులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. జూన్‌లో అవుట్‌డోర్ డైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీ మేయర్.. బిల్ డీ బ్లాసియో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్‌లలో అవుట్‌డోర్ డైనింగ్.. విధానాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అవుట్‌డోర్ డైనింగ్ విధానం వల్ల.. సుమారు 90వేల మందికి కరోనా సమయంలో ఉపాధి దొరికిందన్నారు. కీలకమైన పరిశ్రమల అభివృద్ధికి ఓపెన్ రెస్టారెంట్‌లు ఉపయోగపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ రెస్టారెంట్‌ల కోసం 85 కార్ ఫ్రీ స్ట్రీట్స్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. తమ నిర్ణయం ద్వారా న్యూయార్క్.. ప్రపంచంలోనే శక్తి వంతమైన నగరంగా నిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-09-26T23:10:12+05:30 IST