NewYork కాల్పుల ఘటనలో నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-14T12:48:25+05:30 IST

అమెరికా దేశంలోని న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడైన 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను న్యూయార్క్, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు....

NewYork కాల్పుల ఘటనలో నిందితుడి అరెస్ట్

న్యూయార్క్ (అమెరికా): అమెరికా దేశంలోని న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడైన 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను న్యూయార్క్, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.బ్రూక్లిన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషనులో జేమ్స్ పొగబాంబులు పేల్చి, కాల్పులు జరిపాడు.  న్యూయార్క్ పోలీసులు, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిందితుడి వేటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. జేమ్స్ సెమీ-ఆటోమేటిక్ హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడు.న్యూయార్క్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికా దేశంలో సంచలనం రేపింది.జేమ్స్ మాన్‌హట్టన్ లోని ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో దొరికాడు. జేమ్స్ చిత్రాలను సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు గమనించి పోలీసులను అప్రమత్తం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 


ఈ కాల్పుల ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని పోలీసులు చెప్పారు. అరెస్టు అనంతరం విచారణపై న్యూయార్క్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.ప్రాంక్ జేమ్స్ సోషల్ మీడియా పోస్టులను పోలీసులు కనుగొన్నారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు జేమ్స్ యూట్యూబ్ ఖాతాను తొలగించినట్లు వీడియో ఫ్లాట్ ఫారమ్ తెలిపింది.‘‘జేమ్స్ అలా కాల్పులు జరుపుతాడని నేను అనుకోలేదు, అలా కాల్పులు జరపడం అతని స్వభావం కాదు...కాల్పుల ఘటన తెలిసి నేను ఆశ్చర్యపోయాను’’ అని జేమ్స్ సోదరి కేథరిన్ జేమ్స్ రాబిన్సన్ వ్యాఖ్యానించారు.‘‘ఈ దేశంలో హింస పుట్టింది’’అని జేమ్స్ ఒక వీడియోలో పేర్కొన్నాడు.


దాడికి ఒక రోజు ముందు పోస్ట్ చేసిన వీడియోలో జేమ్స్ నల్లజాతీయులపై నేరాలను విమర్శించాడు.1990 నుంచి 2007వ సంవత్సరం వరకు న్యూయార్క్, న్యూజెర్సీలలో జేమ్స్ ను వివిధ కేసుల్లో 12సార్లు అరెస్టు చేశారు. చోరీ, నేరపూరిత లైంగిక చర్య, అతిక్రమణలపై జేమ్స్ పై కేసులున్నాయి.నిందితుడు తుపాకీని 2011లో చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.



Updated Date - 2022-04-14T12:48:25+05:30 IST