న్యూయార్కులో బార్‌లు, రెస్టారెంట్లపై మళ్లీ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-11-13T05:26:18+05:30 IST

కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా దేశంలోని న్యూయార్కు నగరంలో రాత్రి 10 గంటలకు బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు మూసివేయాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్

న్యూయార్కులో బార్‌లు, రెస్టారెంట్లపై మళ్లీ ఆంక్షలు

కరోనా వ్యాప్తితో గవర్నరు ఆదేశాలు

న్యూయార్కు: కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా దేశంలోని న్యూయార్కు నగరంలో రాత్రి 10 గంటలకు బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు మూసివేయాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ఇన్ డోర్, అవుట్ డోర్ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని ఆదేశించారు. బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వీటిని రాత్రి 10 గంటలకే మూసివేయాలని కోరారు. నవంబరు 13వతేదీ నుంచి స్టేట్ లిక్కర్ అథారిటీ జారీ చేసిన లైసెన్సులున్న బార్ లతో పాటు జిమ్ లను రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలని గవర్నరు ఆదేశించారు.

Updated Date - 2020-11-13T05:26:18+05:30 IST