న్యూయార్క్‌లో కరోనా విలయం.. జూన్ తర్వాత తొలిసారిగా!

ABN , First Publish Date - 2020-09-28T00:47:53+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిరోజు సుమారు 50వేల కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. గ

న్యూయార్క్‌లో కరోనా విలయం.. జూన్ తర్వాత తొలిసారిగా!

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిరోజు సుమారు 50వేల కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న న్యూయార్క్‌లో..  ఒక్కసారిగా రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం వారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష టెస్టులు నిర్వహించగా.. 1,005 కేసులు బయటపడ్డాయని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో శనివారంరోజు ప్రకటించారు. జూన్ 5 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. జూలై చివరి నుంచి సెప్టెంబర్ వరకు కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. రోజుకు సగటున 660 కేసులు నమోదైనట్లు వివరించారు. అయితే గత వారం వీటి సంఖ్య స్వలంగా పెరిగిందన్నారు. తాజాగా కేసుల సంఖ్య 1,005కి చేరిందని పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు ప్రారంభం కావడం వల్లే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 72.87లక్షలకు చేరింది.. 2.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-28T00:47:53+05:30 IST