Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూయార్క్ గవర్నర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. ఉద్యోగానికి సీనియర్ ఉద్యోగిని రాజీనామా!

వాషింగ్టన్: న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తప్పించేందుకు ఏర్పాట్లు జరగుతుండగానే న్యూయర్క్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆండ్రూ క్యూమో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారంటూ ఆయన దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు న్యూయార్క్‌లో సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో మరో 10 మంది మహిళలు కూడా ఆండ్రూ క్యూమో చేసిన నీచాల గురించి బయటపెట్టారు.


దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది. ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధించారని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంతేకాకుండా ఆండ్రూ క్యూమో కార్యాలయంలో సీనియర్ కార్యదర్శిగా పని చేస్తున్న మెలిస్సా డెరోసా పేరును 168 పేజీల నివేదికలో 187సార్లు ప్రస్తావించింది. ఓ బాధితురాలి విషయంలో ఆండ్రూ క్యూమో చేసిన అకృత్యాలను కవర్ చేయడానికి మెలిసా డెరోసా ప్రయత్నించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెలిస్సా డెరోసా.. తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. 


ఇదిలా ఉంటే.. 11 బాధిత మహిళల్లో ఒకరు కొద్ది రోజుల క్రితం న్యూయార్క్ గవర్నర్‌పై క్రిమినల్ కేసు పెట్టారు. అంతేకాకుండా తాజాగా మీడియా ముందుకు వచ్చి.. చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అభిశంసన ద్వారా గవర్నర్ పదవి నుంచి ఆండ్రూ క్యూమోను తప్పించే అంశంపై చర్చించేందుకు న్యూయార్క్ అసెంబ్లీ జ్యూడిషియరీ కమిటీ సోమవారం ఉదయం 9.30గంటలకు సమావేశం కానుంది. కాగా.. స్టేట్ అటార్నీ జనరల్ నివేదికపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా మరికొందరు డెమొక్రాట్లు ఇప్పటికే స్పందించారు. గవర్నర్ పదవికి ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని సూచించారు.  


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement