న్యూయార్క్‌లో కరోనా కల్లోలం.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో!

ABN , First Publish Date - 2020-04-03T23:28:26+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో ఈ మహమ్మారి విశ్వరూపం దాల్చింది. హాస్పటల్స్ అన్నీ వైరస్ బారినపడిన వారితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ కీలక నిర్ణయం తీసు

న్యూయార్క్‌లో కరోనా కల్లోలం.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో ఈ మహమ్మారి విశ్వరూపం దాల్చింది. హాస్పటల్స్ అన్నీ వైరస్ బారినపడిన వారితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధతుల కోసం న్యూయార్క్ సిటీలోని దాదాపు 20 హోటళ్లను లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు. 20 హోటళ్లలో దాదాపు 10వేల పడకలను ఏర్పాటు చేసి, వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. న్యూయార్క్‌లోని ఆస్పత్రుల్లో బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. న్యూయార్క్‌ సిటీలో గురువారం నాటికి 51,809 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఇందులో 3,396 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు 2,373 మంది మరణించారన్నారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో ట్రంప్ సర్కార్ లాక్‌డౌన్ విధించకపోవడంతోనే అక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2020-04-03T23:28:26+05:30 IST