భాగ్యనగరంలో New Year వేడుకలు.. వెంటాడుతున్న భయాలు..

ABN , First Publish Date - 2021-12-31T12:52:15+05:30 IST

భాగ్యనగరంలో New Year వేడుకలు.. వెంటాడుతున్న భయాలు..

భాగ్యనగరంలో New Year వేడుకలు.. వెంటాడుతున్న భయాలు..

హైదరాబాద్‌ సిటీ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన సూచనలతో కొన్ని నిబంధనలతో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పార్టీ ప్రియుల్లో జోష్‌ పెరిగింది. అయితే, సమయం ఎక్కువగా లేకపోవడంతో గతానికి భిన్నంగా, పార్టీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. తారల తళుకులు, సెలబ్రిటీ డీజేల దరువులు లేవు. అయిననూ పార్టీ చేసుకోవాలనే ఉత్సాహం మాత్రం చా లామందిలో కనిపిస్తోంది. ఈవెంట్‌ ఆర్గనైజర్లు మాత్రం ఎంతోకొంత సంపాదించుకోవాలంటూ హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో వేడుకల హంగామా అన్ని చోట్లా కనబడేది కానీ, ఈసారి మాత్రం ప్రభుత్వం అనుమతించినా తమ పరిధిలో తాముండట మే మేలని భావిస్తున్నారు అధికశాతం మంది. అందుకు ఒమైక్రాన్‌ భయాం దోళనే కారణం. ఒమైక్రాన్‌ దెబ్బకు ఈసారి నగరంలో పార్టీలు జరిగేది అనుమానమే అని చెబుతున్నారు పలువురు సోషలైట్స్‌. కానీ కొందరు పార్టీ ప్రియులు మాత్రం ఈవెంట్లకు హాజరుకావడానికి సమాయత్తమవుతున్నారు.

Updated Date - 2021-12-31T12:52:15+05:30 IST