గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో స్మార్ట్ స్పీకర్‌ను లాంచ్ చేసిన ఎంఐ

ABN , First Publish Date - 2020-09-29T23:25:09+05:30 IST

షియోమీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ స్పీకర్ వచ్చేసింది. భారత్‌లో విడుదలైన తొలి ఎంఐ స్మార్ట్ స్పీకర్ ఇదే కావడం గమనార్హం

గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో స్మార్ట్ స్పీకర్‌ను లాంచ్ చేసిన ఎంఐ

న్యూఢిల్లీ: షియోమీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ స్పీకర్ వచ్చేసింది. భారత్‌లో విడుదలైన తొలి ఎంఐ స్మార్ట్ స్పీకర్ ఇదే కావడం గమనార్హం. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, రెండు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్‌ ఉన్న ఇందులో పైన వాయిస్ లైట్ ఉంది. ఇది అచ్చం అమెజాన్ ఎకో స్పీకర్స్‌ను పోలి ఉంది. మెరుగైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్, అద్భుతమైన లుక్ కోసం మెటల్ మెష్ డిజైన్ చేశారు. గూగుల్ హోం మినీ, అమెజాన్ ఎకో డాట్‌లకు ఎంఐ స్మార్ట్‌ స్పీకర్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 


ఎంఐ స్మార్ట్ స్పీకర్ ధర రూ.3,999 మాత్రమే. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ.3,499కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం స్టోర్ల ద్వారా గురువారం నుంచి (అక్టోబరు 1) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. త్వరలోనే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి రానుంది. 


ఎంఐ స్మార్ట్ స్పీకర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: చక్కని మాట్టే ఫినిష్, ప్రిమియం లుక్ కోసం 0.7 ఎంఎం పలుచని మెటల్ మెష్‌, డీటీఎస్ సౌండ్‌తో కూడిన 12 వాట్స్ 2.5 అంగుళాల ఫ్రంట్ ఫైరింగ్ ఆడియో డ్రైవర్, వాల్యూమ్ స్థాయి, ప్లే, పాజ్, మ్యూట్ కోసం టచ్ ప్యానెల్ వంటివి ఉన్నాయి. వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. రెండు ఎంఐ స్మార్ట్ స్పీకర్ యూనిట్లను బ్లూటూత్ ద్వారా కలపడం ద్వారా స్టీరియో సౌండ్‌‌ను కూడా ఆస్వాదించొచ్చు.  

Updated Date - 2020-09-29T23:25:09+05:30 IST