యాపిల్‌ ‘సిరి’కి కొత్త గొంతులు

ABN , First Publish Date - 2021-04-03T05:53:41+05:30 IST

వాయిస్‌ అసిస్టెంట్‌ ‘సిరి’ని రెగ్యులర్‌గా ఉపయోగించుకునే వారి కోసం యాపిల్‌ సంస్థ రెండు కొత్త గొంతులను అందుబాటులోకి

యాపిల్‌ ‘సిరి’కి కొత్త గొంతులు

వాయిస్‌ అసిస్టెంట్‌ ‘సిరి’ని రెగ్యులర్‌గా ఉపయోగించుకునే వారి కోసం యాపిల్‌ సంస్థ రెండు కొత్త గొంతులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెంటిలో యూజర్లు తమకు కావాల్సిన వాయిస్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకటే గొంతు ఉండేది. అయితే రెండు గొంతులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌స్టాల్‌ చేసే సమయంలోనే కావాల్సిన వాయిస్‌ను ఎంచుకోవచ్చు. 


తమ సేవలను మరింత నాణ్యంగా ఉంచేందుకు యాపిల్‌ సంస్థ ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా ‘సిరి’లో రెండు కొత్త స్వరాలను ప్రవేశపెట్టింది.  


 లేవరేజ్‌ న్యూరల్‌ టెక్ట్స్‌ స్పీచ్‌ (న్యూరల్‌ టీటీఎస్‌) సాంకేతికత ఆధారంగా ఈ కొత్త  ‘సిరి’ పనిచేస్తుంది. దీంతో యూజర్లకు సహజసిద్ధమైన స్వరానుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌ మాట్లాడే వారికి ఈ కొత్త ‘సిరి’ అందుబాటులో ఉంటుంది.  తమ డివైస్‌లో భాషను ఎంచుకునే సమయంలో 16 భాషల్లో ఒకదానిని డివైజ్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. 


యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐపాడ్‌, మ్యాక్‌, హోమ్‌ప్యాడ్‌ మినీ, వాచ్‌ల్లో ‘సిరి’ వాయిస్‌ కమాండ్‌ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 కోట్లకుపైగా ఈ యాపిల్‌ ఉత్పత్తుల్లో ప్రతీనెల ‘సిరి’కి 2500 కోట్లకుపైగా ఎంక్వైరీలు వస్తుంటాయి. అదేవిధంగా 36 దేశాల్లో 21 భాషల్లో  ‘సిరి’ని ఉపయోగించుకుంటున్నారు. 


Updated Date - 2021-04-03T05:53:41+05:30 IST