డాట్సన్ రెడీ-గో కొత్త వెర్షన్
ABN , First Publish Date - 2020-06-03T05:59:21+05:30 IST
నిస్సాన్ మోటార్ ఇండియా.. డాట్సన్ రెడీ-గో హ్యాచ్‌బ్యాక్‌లో సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరలు రూ.2.83 లక్షల నుంచి రూ.4.77 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) మధ్యన...
- ధర రూ.2.83 లక్షలు- రూ.4.77 లక్షలు
న్యూఢిల్లీ: నిస్సాన్ మోటార్ ఇండియా.. డాట్సన్ రెడీ-గో హ్యాచ్‌బ్యాక్‌లో సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరలు రూ.2.83 లక్షల నుంచి రూ.4.77 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి. కొత్త డాట్సన్ రెడీ-గో ను 0.8 లీటర్ పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్స్‌తో తీసుకువచ్చినట్లు తెలిపింది.
భారత్‌లో మారుతున్న యువత అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రూపొందించినట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్ కారు అయిన రెడీ-గో లో.. ఎల్-షేప్డ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, పెంటాబ్లేడ్ డ్యూయల్ టోన్ వీల్ వర్‌తో 14 అంగుళాల వీల్స్, వాయిస్ రికగ్నిషన్‌తో 8 అంగుళాల టచ్ స్ర్కీన్ అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించినట్లు నిస్సాన్ తెలిపింది.