ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌ ‘ఇహూ’

ABN , First Publish Date - 2022-01-05T06:15:55+05:30 IST

ఓ వైపు ఒమైక్రాన్‌ దడపుట్టిస్తుండగా.. మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చింది. ఒమైక్రాన్‌లో 37 ఉత్పరివర్తనాలు జరగగా.. ఇందులో 46 మ్యుటేషన్లను గుర్తించారు. ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటేరియన్‌ ఇన్ఫెక్షన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు గుర్తించినందున.. ఆ సంస్థ పేరిట కొత్త వేరియంట్‌ను.. N

ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌ ‘ఇహూ’

ఢిల్లీని కమ్మేస్తున్న కరోనా

ఒక్కరోజే 5,500 కొత్త కేసుల నమోదు

8.37 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు

వారాంతపు కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు పాజిటివ్‌

దేశంలో కొత్తగా 37 వేల కేసులు


న్యూఢిల్లీ, జనవరి 4: ఓ వైపు ఒమైక్రాన్‌ దడపుట్టిస్తుండగా.. మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చింది. ఒమైక్రాన్‌లో 37 ఉత్పరివర్తనాలు జరగగా.. ఇందులో 46 మ్యుటేషన్లను గుర్తించారు. ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటేరియన్‌ ఇన్ఫెక్షన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు గుర్తించినందున.. ఆ సంస్థ పేరిట కొత్త వేరియంట్‌ను ‘ఇహూ’ (ఐహెచ్‌యూ) అని పిలుస్తున్నారు. సాంకేతిక పరిభాషలో ‘బి.1.640.2’ వేరియంట్‌గా వర్గీకరించారు. దీనితో ముడిపడిన తొలి 12 కేసులు ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌ నగర శివారులో బయటపడ్డాయి. బాధితులంతా ఇటీవల ఆఫ్రికా దేశం కామెరూన్‌ నుంచి వచ్చిన వారేనని తేలింది. ఇహూకు సంబంధించిన పలు వివరాలతో కూడిన ఓ పరిశోధనా పత్రం ‘మెడ్‌ ఆర్కైవ్‌’ జర్నల్‌లో డిసెంబరు 29న ప్రచురితమైంది. ఒమైక్రాన్‌ కంటే 20 రోజుల ముందే (నవంబరు 4న) ‘ఇహూ’ వేరియంట్‌ను ఒక స్ట్రెయిన్‌గా గుర్తించి ‘గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా’ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఇహూ కేసులు 12 మాత్రమే రావడం బట్టి దాని వ్యాప్తి అంతంత మాత్రమేనని నిపుణులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-05T06:15:55+05:30 IST