హైదరాబాద్: నగరంలో కొంతమంది యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతున్నారు. పోలీస్ చలాన్లు తప్పించేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు తగిలించి రోడ్లపైకి వస్తున్నారు. అంతేకాదు అతివేగంగా నడుపుతూ ఇతర వాహనాదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై నగర పోలీసులు దృష్టి సారించారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‌ని తొడుగుతున్న వాహనచోదకుల మీద పోలీసులు సెటైర్ వేస్తూ ట్వీట్ పెట్టారు. 'వీరంతా కొత్త వేరియంట్ బాధితులు, వీరిని సరైన ఐపీసీ సెక్షన్లతో ట్రీట్ చేయాల్సి ఉంద'ని ఫన్నీగా ట్వీట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.