కర్నూలు జిల్లా: ఆలూరులో మళ్లీ కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2022-01-05T16:59:54+05:30 IST

కర్నూలు జిల్లా: ఆలూరు పట్టణంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది.

కర్నూలు జిల్లా: ఆలూరులో మళ్లీ కరోనా విజృంభణ

కర్నూలు జిల్లా: ఆలూరు పట్టణంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పట్టణంలోని ఓ బేకరీ నిర్వహకుడి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. బాధితుడి నివాసాన్ని పరిసర ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశారు. బేకరీ నిర్వాహకుడు గత నెల 31న నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా భారీగా కేకులు విక్రయించాడు. కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.


అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒమైక్రాన్ కలకలం రేగింది. దివాన్ చెరువులో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి మస్కట్ నుంచి వచ్చిన మహిళ కూడా ఒమైక్రాన్ బారిన పడ్డారు. ముగ్గురు ఒమైక్రాన్ బాధితులు బయటపడటంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఒమైక్రాన్ బాధితుల కాంటాక్ట్‌లను గుర్తించి కొవిడ్ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Updated Date - 2022-01-05T16:59:54+05:30 IST