అందుబాటులో కొత్త రకం జొన్న

ABN , First Publish Date - 2021-05-07T05:55:14+05:30 IST

అందుబాటులో కొత్త రకం జొన్న

అందుబాటులో కొత్త రకం జొన్న
రైతులు సాగు చేసిన కొత్త రకం ఎస్‌వీటీ-68 జొన్న పంట

కొడంగల్‌రూరల్‌: వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూర్‌, పరిగి, బషీరాబాద్‌, పెద్దెముల్‌ మండలాల్లో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. ఈ భూముల్లో యాసంగి జొన్న సాగుకు అనుకూలమైన జొన్నరకం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు మాములు రకం జొన్నలు సాగు చేసి దిగుబడి రాక తీవ్ర నష్టాలకు గురయ్యేవారని తాండూర్‌ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుజాత, సంధ్యారాణి అన్నారు. అధిక దిగుబడినిచ్చే జొన్న రకం ఎస్‌వీటీ-68 రకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఎస్‌వీటీ-68 జొన్న రకంను చిరు సంచి దశలో పరిశోధనలు నిర్వహి ంచడంతో మెరుగైన ఫలితం వచ్చిందన్నారు. ఎస్‌వీటీ-68 రకం జొన్నతో ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో మాత్రమే ఈ రకం జొన్న సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాగా ఎస్‌వీటీ-68 రకం జొన్న నుంచి రుచికరమైన రొట్టెను పొందవచ్చని, ఈ రకం జొన్నలతో రొట్టెను తయారు చేసి పరిశోధించి పరీక్షించినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-07T05:55:14+05:30 IST