సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం.. ఆడియో లీక్

ABN , First Publish Date - 2020-10-22T19:30:50+05:30 IST

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్వేత ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయటపడింది. నిందితుడు అజయ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏబీఎన్‌కు లభించింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం.. ఆడియో లీక్

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్వేత ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయటపడింది. నిందితుడు అజయ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏబీఎన్‌కు లభించింది. శ్వేతతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు అజయ్ అంగీకరించాడు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టినందుకు తనపై కేసు పెట్టారని అజయ్ చెప్పాడు. తనపై కేసు పెట్టడం వల్లే ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు అతడు తెలిపాడు.


సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్వేత గత నెల 18న ఇంటి నుంచి మాయమై.. మరుసటి రోజు బీబీనగర్ సమీపంలోని ఎన్ఎఫ్‌సీ నగర్ వద్ద రైలు పట్టాలపై మృతదేహంగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే అజయ్ తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని శ్వేత తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేశారు. శ్వేత ఆత్మహత్యకు ముందు అజయ్ సోదరి, తల్లితో మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది.

ఆ ఆడియో సంభాషణను వీడియోలో వినండి.



Updated Date - 2020-10-22T19:30:50+05:30 IST