విజయవాడ: రమేష్ ఆస్పత్రిపై వెలుగు చూస్తున్న కొత్త కోణాలు

ABN , First Publish Date - 2020-08-14T04:05:21+05:30 IST

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం

విజయవాడ: రమేష్ ఆస్పత్రిపై వెలుగు చూస్తున్న కొత్త కోణాలు

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించగా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. స్వర్ణ ప్యాలెస్ హెల్త్ రిపోర్ట్‌ను గురువారం రాత్రి విడుదలైంది. రమేష్ ఆస్పత్రిపై కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.


రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదంగా గుర్తించారు. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని స్పష్టమైంది. అంతేకాకుండా కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు నివేదికతో తేలింది. మరీ ముఖ్యంగా అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు నివేదికతో తేలిపోయింది. రేపు అనగా శుక్రవారం నాడు ఫైర్, ఎలక్ట్రికల్, భద్రతపై జాయింట్ కలెక్టర్ శివశంకర్ కమిటి నివేదికలు అందించనున్నది.


మొత్తానికి చూస్తే.. విచారణ ఫైనల్ దశకు చేరుకున్నది. గత ఐదు రోజులుగా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ విచారణ కొనసాగుతున్నది. ఇవాళ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో జాయింట్ కలెక్టర్ శివశంకర్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తయారు చేసిన నివేదికను కలెక్టర్‌కు వివరించారు. హెల్త్‌కు సంబంధించి రిపోర్ట్‌ను కలెక్టర్‌కు శివకుమార్ అందచేశారు. రేపు పూర్తిస్ధాయి నివేదికను కలెక్టర్‌కు అందచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - 2020-08-14T04:05:21+05:30 IST