పర్యాటక రంగానికి కొత్త హంగులు: మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-09-28T08:11:26+05:30 IST

పర్యాటక రంగానికి కొత్త హంగులు కల్పిస్తున్నాం అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

పర్యాటక రంగానికి కొత్త హంగులు: మంత్రి రోజా
బహుమతులు ప్రదానం చేస్తున్న మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తి

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం


తిరుపతి (కల్చరల్‌), సెప్టెంబరు 27: ‘కరోనా కాలంలో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇపుడిపుడే కుదుటపడుతున్న పర్యాటక రంగానికి కొత్త హంగులు కల్పిస్తున్నాం’ అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం స్థానిక శిల్పారామం వేదికగా ప్రపంచ పర్యాటక దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా రీ ఽథింక్‌ టూరిజం అనే భావనతో ఉందన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలున్న పర్యాటక రంగాన్ని మరింతగా మెరుగుపరచడానికి సీఎం జగన్‌ అన్ని వనరులు కేటాయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన అమరావతిలో విజిట్‌ ఏపీ 2023 అనే పర్యాటక పథకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఆధునిక జీవితంలో ఒత్తిడిని జయించడానికి పర్యటనలు ఉపకరిస్తాయన్నారు. తాను కూడా ఇటీవల కుటుంబంతో అస్ర్టేలియాకు వెళ్లి వచ్చానని చెప్పారు. మారుతున్న యువతరం అభిరుచులకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ఈ ఏడాది వివిధ విభాగాల్లో బహుమతులు అందుకున్న రాష్ట్రంలోని పర్యాటక హోటళ్లు, సిబ్బందికి, కళాకారులకు బహుమతులు అందజేశారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ విభాగంలో తిరుపతికి చెందిన మారస సరోవర్‌, త్రిస్టార్‌ హోటల్‌ విభాగంలో మినర్వాగ్రాండ్‌ హోటల్‌కు బహుమతి దక్కింది.  ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఏపీ పర్యాటక శాఖ సీఈవో కన్నబాబు, అధ్యక్షుడు వరప్రసాద రెడి ్డ, డిప్యూటి సీఈవో రాముడు, శిల్పారామం సీఈవో శ్యాంమోహన్‌ రెడ్డి, వివిధహోటళ్ల యజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. 

Updated Date - 2022-09-28T08:11:26+05:30 IST