Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 12 2021 @ 15:42PM

దుర్గాపూజలో సరికొత్త సంప్రదాయం... మారిన పూజారులు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజల్లో శతాబ్దాలనాటి సంప్రదాయాలను నలుగురు మహిళలు ధిక్కరించారు. నందిని భౌమిక్, రుమ రాయ్, సీమంతి బెనర్జీ, పౌలోమి చక్రవర్తి అనే మహిళలు మహా శక్తి పూజలు నిర్వహిస్తూ, సంచలనం సృష్టిస్తున్నారు. ‘అమ్మవారిని అమ్మలు అర్చిస్తున్నారు’ అనే ఇతివృత్తంతో దక్షిణ కోల్‌కతాలోని 66 పల్లి క్లబ్‌లో జరుగుతున్న పూజల్లో ఈ రికార్డు నమోదైంది. దుర్గా పూజలను పురుష అర్చకులే నిర్వహించడం సంప్రదాయం. ఆ సంప్రదాయానికి వీరు తెర దించారు.


కోల్‌కతా నగరంలో పన్నెండేళ్ళ కిందట ఏర్పాటైన ‘శుభమస్తు’ సంస్థకు మాజీ సంస్కృత ప్రొఫెసర్ నందిని నాయకత్వం వహిస్తున్నారు. ఈ మహిళలు నగరంలో పెళ్లిళ్ళు, శ్రాద్ధ కర్మలు, గృహ ప్రవేశాలు చేయిస్తున్నారు. అయితే వీరు దుర్గా పూజలను నిర్వహించడం ఇదే తొలిసారి. సంప్రదాయ అర్చకుల బృందాల మాదిరిగా కాకుండా తమకు ప్రధాన అర్చకురాలు లేదా నాయకురాలు ఉండరని ఈ మహిళలు తెలిపారు. తరతరాలనాటి సంప్రదాయాలను పాటిస్తూ, ఏ విధంగా పూజలు చేయాలనే అంశంపై ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. 


Advertisement
Advertisement