నూతన రవాణా చట్టాలను వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-20T05:56:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రోడ్డు రవాణా స్టేపీ బిల్లు వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఆటో, లారీ,

నూతన రవాణా చట్టాలను వెనక్కి తీసుకోవాలి
సూర్యాపేటలో రవాణాబంద్‌లో పాల్గొన్న కార్మిక సంఘాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రోడ్డు రవాణా స్టేపీ బిల్లు వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఆటో, లారీ, క్యాబ్‌, జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రవాణా బంద్‌లో భాగంగా కార్మికులు ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. మోదీ తీసుకువచ్చిన కొత్త చట్టాలు మోటార్‌ రంగ కార్మికులకు ఉరితాడని విమర్శించారు. సూర్యాపేటలో ఆర్టీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కొత్తబస్టాండ్‌ నుంచి సద్దుల చెరువు ట్యాంక్‌ బండ్‌ వరకు బారీ ర్యాలీ నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 714 జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, వెంపటి గురూజీ, కొలిశెట్టి యాదగిరిరావు, కొండపల్లి సాగర్‌రెడ్డి, గంట నాగయ్య, రాములు, ఆలేటి మాణిక్యం, శేఖర్‌, సైదులు, అహ్మద్‌, మురళీ, వెంకన్న, తండు శ్రీనివాస్‌, బిక్షం, దాసరి రాంబాబు, కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీ పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ నాయకులు బంద్‌ నిర్వహించారు. నేరేడుచర్లలో పురవీధుల్లో ఆటోల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నీలా రాంమూర్తి, కొదమగండ్ల నగేస్‌, ఎడ్ల సైదులు పాల్గొన్నారు.  మఠంపల్లిలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీ యూ నాయకులు మం డల కన్వీనర్‌ సయ్యద్‌ రన్‌మియా, అశోక్‌, రవి పాల్గొన్నారు. తుంగతుర్తిలో ఆటోడ్రైవైర్లు, ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ యజమానుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సత్యనారాయణగౌడ్‌, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సృజనపరమేష్‌, రమేష్‌, యాదగిరి పాల్గొన్నారు. కోదాడలో ట్యాక్సీ, క్యాబ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీఎ్‌సఎన్‌ఎల్‌  ఆఫీసు ఎదురుగా ప్రధాన రహదారిపై ప్రదర్శన ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంవీఐకి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణంలో ఆటో యూనియన్ల ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రశాంత్‌, సుల్తాన్‌, రమేష్‌, నాగేశ్వరరావు, ఎస్‌కె బషీర్‌ పాల్గొన్నారు.   హుజూర్‌నగర్‌లో ట్రాలీ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య కరుణాకర్‌రెడ్డి, రాము పాల్గొన్నారు. టీఆర్‌ఎ్‌సకేవీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్‌యాదవ్‌, మురళి, షరీఫ్‌, నరేష్‌, జానయ్య, నరసింహా, నాగేశ్వరరావు, శ్రీను, నాగుల్‌మీరా, చారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:56:00+05:30 IST