కొత్త రైలు సర్వీసులు లేనట్లే..

ABN , First Publish Date - 2020-08-12T10:58:36+05:30 IST

జిల్లా మీదుగా ఆగస్టులో మరికొన్ని రైళ్లు నడుస్తాయని ఎదురుచూసిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది.

కొత్త రైలు సర్వీసులు లేనట్లే..

జిల్లా మీదుగా నాలుగు  రైళ్లే


నరసాపురం, ఆగస్టు 11: జిల్లా మీదుగా ఆగస్టులో మరికొన్ని రైళ్లు నడుస్తాయని ఎదురుచూసిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ప్రస్తుతం జిల్లా మీదుగా నడుస్తున్న నాలుగు స్పెషల్‌ రైళ్లే కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ మినహాయింపులతో దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కూడా పెరిగాయి. డెల్టా, ఏలూరు, టీపీగూడెం మీదుగా మరికొన్ని స్పెషల్‌ రైళ్లు నడుస్తాయని ప్రయాణికులు ఆశించారు.


నరసాపురం నుంచి హైదరాబాద్‌,  కాకినాడ నుంచి శేషాద్రి, చెన్నై సర్కార్‌ రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో జిల్లా మీదుగా వెళ్లిన మరికొన్ని రైళ్లు పట్టాలెక్కవచ్చని భావించారు. రైల్వే ఆధికారులు కూడా గతంలో కొన్ని నడిచిన రైళ్లను సిద్ధం చేసి ఉంచారు. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు కొత్త రైళ్లేవి నడిపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.దీంతో ప్రస్తుతం నడుస్తున్న విశాఖ- న్యూఢిల్లీ, కొణ్కార్‌ -ముంబాయి, హైద్రాబాద్‌ - కొల్‌కొత్తా, విశాఖ- హైదరాబాద్‌ రైళ్లే తిరగనున్నాయి.

Updated Date - 2020-08-12T10:58:36+05:30 IST