న్యూ సిస్టం!

ABN , First Publish Date - 2021-10-18T04:49:07+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలంగా నెలకొన్న

న్యూ సిస్టం!

  • ‘స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం’లో ప్రభుత్వ బడుల వివరాలు
  • పాఠశాల సమగ్ర స్వరూపాన్ని ఉన్నచోటు నుంచే తెలుసుకునేందుకు కొత్త యాప్‌కు శ్రీకారం
  • ఇప్పటికే వందశాతం నమోదు ప్రక్రియ పూర్తి
  • సమస్యల పరిష్కారానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎదురుచూపులు


షాద్‌నగర్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు విద్యాశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (సీపీ యాప్‌)ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా విద్యాశాఖ అధికారులు కూర్చున్న చోటునుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాప్‌ వీలవుతుంది. గతంలో ప్రతీ సంవత్సరం పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులు, సదుపాయాల కోసం ప్రధానోపాధ్యాయులు నివేదికలు రూపొందించి విద్యాశాఖకు ప్రతిపాదనలు అందజేయడం, ఇచ్చిన నివేదికలకు ఏళ్ల తరబడి మోక్షం లభించకపోవడ పారిపాటిగా ఉండేది. ఈ సమస్యలను అధిగమించడానికి విద్యాశాఖ సీపీయా్‌పను అమల్లోకి తీసుకొచ్చింది. 


యాప్‌లో పూర్తి వివరాలు

స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ యాప్‌లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పూర్తివివరాలు పొందుపర్చుతారు. తరగతి గదుల వైశాల్యం, ఆటస్థలం, తాగునీటి సౌకర్యం, వంటగది, ఫోరింగ్‌ లాంటి సమాచారాన్ని నమోదు చేస్తారు. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి గదుల వైశాల్యాన్ని పెంచడం, పాఠశాల చుట్టూ జియో ఫెన్సింగ్‌ చేసి.. బడి ఉన్న ప్రదేశం, హద్దులు, విస్తీర్ణం లాంటి అం శాలను కూడా యాప్‌లో పొందుపరుస్తారు. దీనిద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రభుత్వ పాఠశాలల వివరాలను అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో సమస్యలు ఉన్నచోట పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. 


ప్రతి పాఠశాలకు కోడ్‌ 

యాప్‌లో వివరాల నమోదుకుగాను ప్రతి పాఠశాలలకు 11అంకెలతో కూడిన కోడ్‌ను విద్యాశాఖ కేటాయించింది. కోడ్‌ ఆధారంగా తరగతి గదిలో ఉండే నాలుగు గోడలు, స్లాబ్‌, ఫ్లోరింగ్‌, మరుగుదొడ్లు, తాగునీరు, వంటగదిలాంటి ఎనిమిది ప్రధానాంశాలను రికార్డు చేసి యా ప్‌లో నమోదు చేస్తారు. ఈ అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దేలా విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది.


వందశాతం పూర్తి ? 

ఇప్పటికే షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వం పాఠశాలలను వందశాతం డిజిటలైజేషన్‌ చేశారు. నిధుల విడుదల కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో మొ త్తం 291 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 22,747 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,263 మంది ఉపాధ్యాయులు  విధులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చాలా సమస్యలు తిష్టవేశాయి. సీపీ యాప్‌ ద్వారైనా వాటికి పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఉపాధ్యాయులున్నారు.


అభివృద్ధికి సంకేతాలు

విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు షాద్‌ నగర్‌ నియో జకవర్గంలోని అన్ని ప్రభుత్వం పాఠశా లల వివరాలను సీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేశాం. దీనివల్ల స్కూళ్ల అభివృద్ధికి వెంటనే నిధులు మం జూరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కొరత ఉండదు. పాఠశాలలో ఉన్న లోపాలను ఎలాంటి నివేదికలు లేకుండానే విద్యాశాఖ గుర్తించే అవకాశం ఉంది.

- శంకర్‌రాథోడ్‌, ఎంఈవో



Updated Date - 2021-10-18T04:49:07+05:30 IST