రూ.3.50 కోట్లతో నూతన స్టేడియం

ABN , First Publish Date - 2021-12-07T04:27:26+05:30 IST

పాలమూరులోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో రూ.3.50 కోట్లతో నూతన స్టేడియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

రూ.3.50 కోట్లతో నూతన స్టేడియం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష 


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 6: పాలమూరులోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో రూ.3.50 కోట్లతో నూతన స్టేడియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిం చారు. కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావ్‌, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, మునిసిపల్‌, పంచా యతీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెట్‌ మైదానంలో కూడా పనులను త్వరితగతిన చేప ట్టాలన్నారు. బైపాస్‌, భూత్పూర్‌- మహబూబ్‌నగర్‌ రహదారి  పొడవునా సెం ట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  పట్టణంలో రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని, డివైడర్‌ మధ్యలో పదేళ్ల వ యసున్న మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. రూ.8 కోట్లతో చేపడుతున్న స్లాటర్‌హౌస్‌ పనులు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు చేప ట్టాలన్నారు. రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద మరో మోడ్రన్‌ మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. హన్వాడ దగ్గర 500 ఎకరా లలో చేపట్టిన ఫుడ్‌ పార్క్‌ పనులు వేగవంతం చేయాలని, అప్పన్నపల్లి దగ్గర రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపై చర్చించారు. చిన్నదర్పల్లి నుంచి ధర్మాపూర్‌ వరకు చేపట్టే బైపాస్‌ రహదారికి తుది రూపం ఇవ్వాలన్నారు. భవిష్యత్తు మహబూబ్‌నగర్‌ ఎలా ఉండాలో రోడ్‌మ్యాప్‌ తయారు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకు న్నారు. పాలమూరును హైదారబాద్‌కు దీటుగా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని, పట్టణంలో చేపడుతున్న జంక్షన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, సీపీవో దశరథం, ఆర్‌అండ్‌బీ డీఈ సంధ్య, పీఆర్‌ఈఈ నరేందర్‌ పాల్గొన్నారు.

- చలో ఢిల్లీ కరపత్రాన్ని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విడుదల చేశారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడిపాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ నేతృత్వంలో ఈనెల 13న ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు కోరారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దేలి జంబులయ్య, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లెపోగు శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T04:27:26+05:30 IST