కొత్త సాఫ్ట్‌వేర్‌ డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

పాపులర్‌ షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’ డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం ‘టిక్‌టాక్‌ లైవ్‌ స్టూడియో’ పేరుతో స్ట్రీమింగ్‌ సాఫ్ట్‌వేర్‌ తీసుకురానుంది....

కొత్త సాఫ్ట్‌వేర్‌ డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం

పాపులర్‌ షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’  డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం ‘టిక్‌టాక్‌ లైవ్‌ స్టూడియో’ పేరుతో స్ట్రీమింగ్‌ సాఫ్ట్‌వేర్‌ తీసుకురానుంది. దీన్ని ఒకసారి డెస్క్‌టాప్‌ పైకి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు, తమ టిక్‌టాక్‌ అకౌంట్‌ నుంచి నేరుగా లైవ్‌కు అవకాశం కలుగుతుంది. చాట్‌ ఫీచర్‌ను ఉపయోగించి వీక్షకులతో నేరుగా మాట్లాడుకోవచ్చు. కంప్యూటర్‌, ఫోన్‌, గేమింగ్‌ కన్‌సోల్‌ నుంచి కంటెంట్‌ను నేరుగా స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి పాశ్చాత్య దేశాల మార్కెట్లలో మాత్రమే ఉంది. ట్విచ్‌ లేదంటే  యూట్యూబ్‌ గేమింగ్‌కు బదులు యాప్‌లో నుంచి క్రియేటర్లు తమ వీక్షకులకు దగ్గర కావచ్చు. 

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST