ప్రవాసులను పెళ్లాడిన కువైత్ మహిళల కోసం కొత్త సర్వీసులు

ABN , First Publish Date - 2021-12-26T13:33:34+05:30 IST

ప్రవాసులను పెళ్లాడిన కువైత్ మహిళల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త సర్వీసులను తీసుకొచ్చింది.

ప్రవాసులను పెళ్లాడిన కువైత్ మహిళల కోసం కొత్త సర్వీసులు

కువైత్ సిటీ: ప్రవాసులను పెళ్లాడిన కువైత్ మహిళల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా సిటిజెన్ సర్వీస్ సెంటర్లను తెరిచింది. ఎవరైతే కువైటీ మహిళలు ప్రవాసులను పెళ్లి చేసుకున్నారో వారు తప్పకుండా ఈ కేంద్రాలకు వెళ్లి తమ పూర్తి వివరాలను అందించాలి. భర్తకు సంబంధించిన ప్రతి లావాదేవీల వివరాలు, పిల్లలు ఇలా అన్ని వివరాలను ఇవ్వాలి. ఇలా ఒకసారి డిజిటలైజ్‌గా వివరాలను నమోదు చేసుకుంటే.. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు నేరుగా సంబంధిత వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ వివరాలతో పనులు చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వశాఖలోని రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్‌సెక్రెటరీ మేజర్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ తెలిపారు. అల్ సలామ్ ప్రాంతంలో తొలి సిటిజెన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించారు. సిటిజెన్ సర్వీస్ సెంటర్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ ఖదేర్ షాబాన్‌తో అన్వర్ అల్ బర్జాస్ ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోని దేశంలోని మిగతా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రవాసులను పరిణయమాడిన కువైటీ మహిళలు సర్వీస్ సెంటర్స్‌కు వచ్చి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. 


Updated Date - 2021-12-26T13:33:34+05:30 IST