Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 09 Jan 2022 00:00:00 IST

కొత్త సీజన్‌కు ముస్తాబు

twitter-iconwatsapp-iconfb-icon
కొత్త సీజన్‌కు ముస్తాబు

కరోనా ఓటీటీని సామాన్యుడి చెంతకు చేర్చితే ఒరిజినల్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌ల ద్వారా ఓటీటీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అప్పటికే వేళ్లూనుకున్న బుల్లితెర, వెండితెరకు ప్రత్యామ్నాయంగా ఓ సరికొత్త వినోద ప్రపంచాన్ని సగటు ప్రేక్షకుడి ముంగిట్లోకి తీసుకురావడంలో  ఓటీటీలు సక్సెసయ్యాయి.  ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో  వెబ్‌ సిరీస్‌  కీలకపాత్ర వహించాయి.  అందుకే కొత్త సంవత్సరంలోనూ తమ చందాదారులను నిలుపుకోవడానికి, మరికొంతమంది కొత్త వారిని ఆకట్టుకోవడానికి విభిన్న ఇతివృత్తాలతో వెబ్‌ సిరీస్‌ అందించే పనిలో ఓటీటీ వేదికలు బిజీగా ఉన్నాయి. కొత్త వెబ్‌ సిరీస్‌లతో పాటు  పాపులర్‌ అయిన  వెబ్‌సిరీస్‌లకు సీక్వెల్స్‌ రూపొందిస్తున్నాయి.  కొత్త సంవత్సరంలో ఆసక్తి రేపుతున్న వెబ్‌ సిరీస్‌ సీక్వెల్స్‌పై ఓ లుక్కేద్దాం. 


పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌  ప్రైమ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: 2022 ఆఖరుకు 

దర్శకులు: అవినాష్‌ అరుణ్‌, ప్రోసిత్‌ రాయ్‌

తారాగణం: జైదీప్‌ అహ్లావత్‌, నీరజ్‌ కబీ, స్వస్తికా ముఖర్జీ


నేరగాళ్లు, పోలీసుల మధ్య సాగే దాగుడుమూతలే కాదు రాజకీయ నాయకులు, పోలీసులు, నేరగాళ్లకు మధ్య బలమైన తెరవెనుక సంబంధాలు కూడా ఉంటాయి. ఇదే అంశాన్ని హైలెట్‌ చేస్తూ వచ్చిన ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను కట్టిపడేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ ఏడాది ఆఖరులో ‘పాతాళ్‌లోక్‌’ వెబ్‌సిరీస్‌ సీజన్‌ 2 వస్తుందని  అమెజాన్‌ ప్రైమ్‌ ప్రకటించింది. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. 


ద ఫ్యామిలీ మాన్‌ సీజన్‌ 3

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌

దర్శకత్వం: రాజ్‌ నిడమూరు, కృష్ణ డీకే

నటీనటులు: మనోజ్‌ బాజ్‌పాయ్‌, షరీబ్‌ హ ష్మీ, ప్రియమణి

భాషా భేదాలు లేకుండా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న హిందీ వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మాన్‌’. ఈ యాక ్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సీజన్‌ 2 కూడా సూపర్‌హిట్‌ అయింది. ఇందులో సమంత లీడ్‌రోల్‌లో కనిపించారు. ఇప్పుడు మేకర్స్‌ మూడో సీజన్‌కు సిద్ధమవుతున్నారు. 
అన్‌దేఖీ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: సోనీలివ్‌

దర్శకత్వం: ఆశిష్‌ ఆర్‌. శుక్లా

నటీనటులు: దివ్యేందు భట్టాచార్య, హర్ష్‌ చాయ, అంకుర్‌ రాఠీ

స్ట్రీమింగ్‌ డేట్‌: ఈ ఏడాది ద్వితీయార్థంలో 

దేశంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటలను ముడివేస్తూ రూపొందించిన కథనంతో ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది ‘అన్‌దేఖీ’ సిరిస్‌. గతేడాది వచ్చిన ఈ సిరీస్‌కు ఈ ఏడాది రెండో సీజన్‌ తెచే ్చందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. 


అసుర్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: వూట్‌

నటీనటులు: అర్షద్‌ వార్సీ, బరున్‌ సోబ్తీ, అనుప్రియా గోయంకా

స్ట్రీమింగ్‌ డేట్‌: ఈ ఏడాది ప్రథమార్థంలో

వూట్‌ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ గురించి తెలియనివాళ్లకు కూడా అందులో గతేడాది స్ట్రీమింగ్‌ అయిన ‘అసుర్‌’ సిరీస్‌ పేరు మాత్రం గుర్తుండిపోయింది. గతేడాది వచ్చిన క్రైమ్‌ సిరీస్‌ల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ ఈ సిరీస్‌తోనే ఓటీటీ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. 


పంచాయత్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌

నటీనటులు: జితేంద్రకుమార్‌, రఘుబీర్‌ యాదవ్‌, నీనాగుప్తా

రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామం, అక్కడ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించే ఓ యువకుడు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్‌ ‘పంచాయత్‌’. ఓ వైపు ప్రజాస్వామ్యంలోని వైఫల్యాలను సున్నితంగా ఎత్తి చూపుతూ గ్రామీణ పాత్రలతో పండించిన హాస్యం ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కొత్త సీజన్‌కు ప్రైమ్‌ రంగం సిద్ధం చేసింది. 


మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌ 

దర్శకత్వం: జోయా అక్తర్‌

నటీనటులు: అర్జున్‌ మాథుర్‌, శోభితా ధూలిపాళ్ల

ఈ సిరీస్‌ ద్వారా భారతీయ వివాహ వ్యవస్థలోని లోటుపాట్లను గురించి బహిరంగంగా చర్చించే సాహసం ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించింది.  పరువు ప్రతిష్ఠ, కుటుంబ బంధాలు నేపథ్యంలో నలిగిపోతున్న వ్యక్తిత్వాలను, గే సంస్కృతిని సున్నితంగా చర్చలో పెట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’కు ఈ ఏడాది రెండో సీజన్‌ రాబోతోంది. 


ముంబై డైరీస్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌

దర్శకత్వం: నిఖిల్‌ అద్వాణీ

నటీనటులు: మోహిత్‌ రైనా, కొంకణాసేన్‌ శర్మ, ప్రకాష్‌ బేల్వాడీ, 

ముంబై నగరంపై పలు మార్లు జరిగిన ఉగ్రదాడులు సినిమాలు, సిరీస్‌లకు కావాల్సినంత ముడి సరుకును అందిస్తూనే ఉన్నాయి. ఇదే కథాంశంతో గతేడాది వచ్చిన ‘ముంబై డైరీస్‌’ కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది. ముంబైలో జరగబోయే మరో ఉగ్రదాడితో ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు ఈ ఏడాది సీజన్‌ 2తో వస్తోంది. 

కొత్త సీజన్‌కు ముస్తాబు

ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌ 

దర్శకత్వం: రిచీమెహతా

స్ట్రీమింగ్‌ డేట్‌: ఈ ఏడాది ద్వితీయార్థంలో

దారుణమైన అత్యాచారం ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించడం, మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అనుసరించిన విధానాలు, ఎక్కడా బిగి సడలనివ్వని కథనం వెరసి ‘ఢిల్లీ క్రైమ్స్‌’ సిరీస్‌ను హిట్‌ చేశాయి 2019లో వచ్చిన ‘ఢిల్లీ క్రైమ్స్‌’ తొలి సీజన్‌కు మంచి వ్యూయర్‌షిప్‌ రావడంతో ఈ ఏడాది రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

కొత్త సీజన్‌కు ముస్తాబు

కోడ్‌ ఎం సీజన్‌ 2

ప్లాట్‌ఫామ్‌:  వూట్‌

దర్శకత్వం: ఒనీ సేన్‌

నటీనటులు: అర్షద్‌ వార్సీ, బరున్‌ సోబ్తీ, అనుప్రియా గోయంకా

ఆర్మీఎన్‌కౌంటర్స్‌లో జరిగిన మరణాల నేపథ్యంలో సాగే కోర్ట్‌ రూమ్‌ డ్రామాతో ఓ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను అలరించడం అంత ఆషామాషీ కాదు. ‘కోడ్‌ ఎం’ ఫస్ట్‌ సీజన్‌ ఆ ఫీట్‌ను సాధించింది. అందుకే మరో సీజన్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతోంది. 

కొత్త సీజన్‌కు ముస్తాబు

మీర్జాపూర్‌ సీజన్‌ 3

ప్లాట్‌ఫామ్‌: అమెజాన్‌ ప్రైమ్‌

దర్శకత్వం: కరణ్‌ అన్ష్‌మాన్‌

నటీనటులు: పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, రసికా దుగ్గల్‌, శ్వేతా త్రిపాఠి

మాఫియా గ్యాంగ్‌వార్‌ సిరీస్‌ల్లో ది బెస్ట్‌ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘మీర్జాపూర్‌’. లోకల్‌ గ్యాంగ్‌వార్‌తో కథను రక్తికట్టించిన తీరుకు ప్రేక్షక జనం ఫిదా అయ్యారు. రెండు సీజన్లు సూపర్‌హిట్‌ అవ్వడంతో ఈ ఏడాది మూడో సీజన్‌తో రెడీ అవుతున్నారు. ఇటీవలె స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.