కొత్త జీతాలకు బిల్లులు పెట్టండి!

ABN , First Publish Date - 2022-01-29T06:49:13+05:30 IST

కొత్త పీఆర్సీని సక్రమంగా అమలు చేసేవరకూ తమకు పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఒవైపు ఆందోళన చేపడితే, ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ద్వారా కొత్త జీతాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త జీతాలకు బిల్లులు పెట్టండి!

  • జిల్లా కలెక్టర్‌ ద్వారా శాఖాధిపతులపై ఒత్తిడి

రాజమహేంద్రవరం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కొత్త పీఆర్సీని సక్రమంగా అమలు చేసేవరకూ తమకు పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఒవైపు ఆందోళన చేపడితే, ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ద్వారా కొత్త జీతాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జీతాలు ఒకసారి తీసుకుంటే కొత్త పీఆర్సీని ఆమోదించినట్టేనని, దీనివల్ల రాజమహేం ద్రవరం, కాకినాడ నగరాల్లో ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 20 శాతం నుంచి 8 శాతా నికి పడిపోతుందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అసలు అన్ని వర్తించే పీఆర్సీని తక్షణం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రకరకాల ఒత్తిళ్లు తెస్తోంది. కొత్త జీతాలే ఇవ్వాలని డీడీవో లకు, ట్రెజరీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యో గులంతా తమకు పాత జీతాలే కావాలని డీడీవోలకు ఇప్పటికే అనుమతి పత్రాలు ఇచ్చారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ మీద ఒత్తిడి పెంచింది. జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులంతా కలెక్టర్‌ మాట వింటారు. దాంతో ఆయనతో శాఖాధిపతులకు చెప్పించారు. కానీ ఇప్పటికే పాత జీతాలు కావాలని తమ ఉద్యోగులు అందరూ లేఖలు ఇచ్చినట్టు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. 

Updated Date - 2022-01-29T06:49:13+05:30 IST