జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

ABN , First Publish Date - 2021-12-27T09:37:18+05:30 IST

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

చెప్పులు, వస్త్రాలు మరింత ప్రియం.. పన్ను ఎగవేతలిక చెల్లవ్‌

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం నుంచి జీఎ్‌సటీకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. చెప్పులు, వస్త్రాలు మరింత భారం కానున్నాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల చెప్పులు, వస్త్రాలపై 12 శాతం జీఎ్‌సటీ రేటు అమలు కానుంది. పత్తిని మాత్రమే ఈ భారం నుంచి మినహాయించారు. ఇ-కామర్స్‌ సంస్థలు అందించే ప్రయాణికుల రవాణా సేవలపైనా జనవరి 1 నుంచి అయిదు శాతం జీఎ్‌సటీ అమల్లోకి రానుంది. ఆఫ్‌లైన్‌ లేదా మాన్యువల్‌గా ఆటోరిక్షా డ్రైవర్లు అందించే సేవలకు మాత్రం ఇది వర్తించదు.  


రెస్టారెంట్లు, హోటళ్ల అక్రమాలకు చెక్‌

రెస్టారెంట్లు, హోటళ్ల పన్ను ఎగవేతకు చెక్‌పెట్టేందుకూ నూతన సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇక నుంచి రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి వినియోగదారులకు అందించే ఆహార పదార్ధాల లావాదేవీల జీఎ్‌సటీ చెల్లింపు భారం జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫారాలదే. ఈ సంస్థలే ఇక రెస్టారెంట్ల నుంచి జీఎ్‌సటీ వసూలు చేసి ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందుకోసం ఆయా రెస్టారెంట్లకు ఇన్‌వాయి్‌సలు జారీ చేయాలి. అయితే ఈ మార్పుతో వినియోగదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు. ఈ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా జరిగే అమ్మకాలపై రెస్టారెంట్లు గత రెండేళ్లలో రూ.2,000 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 


ఆధార్‌తో లింకు 

 జీఎ్‌సటీ  రిఫండ్‌నూ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. వస్తువుల సరఫరా వివరాల్లో ఏ మాత్రం తేడా ఉన్నా అధికారులు ఇక ఆయా సంస్థలను ఆకస్మికంగా సందర్శించి, చెల్లించాల్సిన జీఎ్‌సటీని ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.  జీఎ్‌సటీఆర్‌-1, జీఎ్‌సటీఆర్‌-3బీ వివరాల్లో ఉండే తేడాల ఆదారంగా అధికారులు ఈ తనిఖీలు చేస్తారు. దీని వల్ల ఐటీసీ కోసం అమ్మకందారులు సమర్పించే నకిలీ బిల్లులకు చెక్‌పడనుంది.

Updated Date - 2021-12-27T09:37:18+05:30 IST