New RBI proposal : ఆర్బీఐ కొత్త ప్రతిపాదన.. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లందరూ తెలుసుకోవాల్సిన విషయం..

ABN , First Publish Date - 2022-08-20T02:30:08+05:30 IST

లాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించకుండా హాయిగా ఎన్ఈఎఫ్‌టీ (NEFT) లావాదేవీలు నిర్వహిస్తున్నారా ?..

New RBI proposal : ఆర్బీఐ కొత్త ప్రతిపాదన.. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లందరూ తెలుసుకోవాల్సిన విషయం..

ముంబై : ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించకుండా హాయిగా ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్) లావాదేవీలు (NEFT transactions )  నిర్వహిస్తున్నారా ?.. అయితే త్వరలోనే ఈ ఉచిత సర్వీసు ముగిసిపోవచ్చు. ఎందుకంటే ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజులు(processing charges) విధించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) యోచిస్తోంది. బ్యాంకు బ్రాంచీల ద్వారా ఈ నిబంధన అమలు చేయాలనే ఉద్దేశంతో నూతన ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ‘డిస్కషన్ పేపర్ ఆన్ ఛార్జెస్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్స్’లో ఆర్బీఐ ప్రస్తావించింది. నగదు లావాదేవీ విలువ రూ.2 లక్షలు మించితే రూ.25 వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలో పేర్కొంది. మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్న ఖాతాదారుల ఆన్‌లైన్ ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు డిస్కషన్ పేపర్ బుధవారం(17 ఆగస్టు 2022)న విడుదల చేసింది. కాగా ప్రస్తుతానికి ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదనే విషయం తెలిసిందే.


నెఫ్ట్‌పై ప్రతిపాదిత ఛార్జీలు ఇలా..

- రూ.10 వేలు దాటితే రూ.2.5

- రూ.10 వేలు నుంచి రూ.1 లక్ష మధ్య రూ.5

- రూ.1 లక్ష - రూ.2 లక్షల మధ్య రూ.15

- రూ.2 లక్షలు పైబడితే రూ.25




అయితే ప్రాసెసింగ్ ఫీజులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బ్యాంక్ ఖాతాదారులు గమనించాలి. ఈ ప్రతిపాదనలపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. వారి నుంచి వచ్చే స్పందనలను బట్టి తుది నిర్ణయం ఖరారయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే బ్యాంకులపై పనిభారం పెరిగే అవకాశం ఉంటుంది. అదనపు వ్యయంతోపాటు బ్రాంచుల్లో సిబ్బంది పని సమయం కూడా పెరిగే సూచనలున్నాయి.

Updated Date - 2022-08-20T02:30:08+05:30 IST