అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డులు

ABN , First Publish Date - 2021-07-28T04:30:44+05:30 IST

అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు అందిస్తామని శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి అన్నారు.

అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డులు
సంగారెడ్డిలో రేషన్‌కార్డును అందజేస్తున్న భూపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి

 శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

 సంగారెడ్డి అర్బన్‌, జూలై 27 : అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు అందిస్తామని శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది వుుబారక్‌ చెక్కులను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్‌, కంది మండలాలకు చెందిన 396 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, 1,383 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ నరహరిరెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా సంగారెడ్డి పట్టణంలోని 37 వార్డులో రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌  ప్రారంభించారు.


రేషన్‌కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

జిన్నారం/గుమ్మడిదల/వట్‌పల్లి/కంగ్టి/జహీరాబాద్‌/తూప్రాన్‌, జూలై 27:  జిన్నారంలో నూతనంగా మంజూరైన 547 రేషన్‌ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. గుమ్మడిదలలోని ఓ గార్డెన్‌లో 275 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులను, 33 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణా భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విక్టర్‌, ఏఎంసీ చైర్మన్‌ రజనీకాంత్‌, ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ అపర్ణ పాల్గొన్నారు. కంగ్టిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు కొత్త రేషన్‌ కార్డులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీతావెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ లలిత పాల్గొన్నారు. జహీరాబాద్‌, మెగుడంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 859 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు రేషన్‌కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్‌ నాగేశ్వరావు పాల్గొన్నారు. మనోహరాబాద్‌, తూప్రాన్‌ మండలాలకు చెందిన పేదలకు కొత్త రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులను జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, ఎంపీపీ స్వప్న, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, ఫాక్స్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-28T04:30:44+05:30 IST