టిడ్కో నివాసాల్లో కొత్త క్వారంటైన్లు

ABN , First Publish Date - 2020-04-10T05:48:33+05:30 IST

నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీలో కొత్త క్వారంటైన్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని

టిడ్కో నివాసాల్లో కొత్త క్వారంటైన్లు

కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరులో ఏర్పాట్లు 

యుద్ధ ప్రాతిపదికన పనులు

పరిశీలించిన కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీలో కొత్త క్వారంటైన్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ సంబంధిత అధికారు లకు గురువారం ఆదేశాలిచ్చారు. టిడ్కో హౌసింగ్‌ కాలనీని ఆయన పరి శీలించారు. పూర్తి అయిన బ్లాకులు, గృహాల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఉన్న వాటికి తోడు అదనపు క్వారంటైన్‌ సెంటర్లను అందు బాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగ నూరులో కొత్త క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కర్నూలు టిడ్కో హౌసింగ్‌ కాలనీలో దాదాపు 10 వేల ఇళ్లు ఉన్నాయి.


ఇక్కడ 2 వేల క్వారంటైన్‌ బెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నంద్యాలలో 10 వేల టిడ్కో ఇళ్లు ఉన్నాయి. ఇందులో 3 వేల నివాసాలను క్వారంటైన్‌ కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఎమ్మిగనూరు హౌసింగ్‌ కాలనీలో 3,260 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 2,500 గృహాలను క్వారంటైన్‌కు వినియోగిస్తారు. ఆదోనిలో టిడ్కో కాలనీలు ఉన్నా అక్కడ క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం లేదు. 


కొత్త సెంటర్లు ఎందుకంటే..

రాష్ట్రంలో కరోనా అనూహ్యంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల  క్రితం క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయా లని ఆదేశించింది. ఇప్పటివరకు జిల్లాలో 16 క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. తాజాగా ఇంటింటి సర్వే నిర్వహించి, కరోనా అనుమానితులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా గుర్తించినవారిని క్వారం టైన్‌కు తరలించాల్సి వస్తుంది. ఇందుకు అనుగుణంగా క్వారంటైన్‌ సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి  ప్రతిపాదనలు వెళ్లాయి. తాజాగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌ సెంటర్ల కోసం పేదల కోసం నిర్మిం చిన టిడ్కో నివాసాలను వినియోగించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు అంటున్నారు.


ఈ నేపథ్యంలో నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీని కలెక్టర్‌ వీరపాండియన్‌ గురువారం పరిశీలించారు. ప్రతి గదిలో టాయిలెట్స్‌, ఫ్యాన్లు, నీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను కల్పించి, వెంటనే వైద్య శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ ఆండ్‌ బీ, హౌసింగ్‌, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అక్కడే ఉండి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఒక్కో బ్లాకుకు ఒక ఏఈని పర్యవేక్షణ కోసం నియమించాలని సూచించారు. ఇక్కడ పని చేసే సిబ్బందికి భోజన వసతి కల్పించాలని సూచించారు.


ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్లాన్‌ ప్రకారం పనుల పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు. టిడ్కో హౌసింగ్‌ కాలనీ క్వారంటైన్‌లో శాని టేషన్‌ కోసం ఏజెన్సీని నియమించి, శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పనులు ఎంత వరకు పూర్తయ్యాయో ఎప్పటికపుడు సమాచారం అందించాలని, త్వరగా క్వారంటైన్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.  


Updated Date - 2020-04-10T05:48:33+05:30 IST