వ్యాక్సిన్ వేయించుకున్నవారికీ తప్పని కరోనా ముప్పు!

ABN , First Publish Date - 2021-08-23T11:53:12+05:30 IST

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వైరస్‌తో...

వ్యాక్సిన్ వేయించుకున్నవారికీ తప్పని కరోనా ముప్పు!

న్యూఢిల్లీ: ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. వైరస్‌పై పోరాటంలో టీకా బలమైన ఆయుధంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. మరోవైపు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు ఒక ఆందోళనకర అంశాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ప్రజలు ఎందుకు వైరస్ బారిన పడుతున్నారో, ఇలా ఎన్నిసార్లు జరుగుతుందో తెలియడం లేదంటున్నారు. 


టీకా తీసుకున్నవారికి కరోనా సోకితే అది ఎంతమందికి వ్యాపిస్తుందో కూడా స్పష్టం కావడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు టీకా తీసుకున్న వారు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డైరెక్టర్ టామ్ ప్రిడెన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌పై జరిపిన పరిశోధనల్లో మాకు అంధిన ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. అయితే ఈ పరిశోధనల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాల్సి ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని, కరోనా నిబంధనలను  తప్పనిసరిగా పాటించాలన్నారు. 


Updated Date - 2021-08-23T11:53:12+05:30 IST