వెంకటగిరిలో నూతన జైలు

ABN , First Publish Date - 2021-02-25T07:28:38+05:30 IST

జిల్లాలోని వెంకటగిరిలో నూతన కారాగారం నిర్మించనున్నారు. గతంలో ఉన్న జైలును మూసివేయగా అందులో కోర్టు భవనం నిర్మించడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఐక్యరాజ్య సమితి ప్రమాణాలకు అనుగుణంగా నూతన జైలును నిర్మించనున్నారు.

వెంకటగిరిలో నూతన జైలు
స్థల పరిశీలనలో జైళ్ల శాఖ డీజీ హసన్‌ రెజా తదితరులు

నిర్మాణానికి డీజీ స్థల పరిశీలన


నెల్లూరు(క్రైం), ఫిబ్రవరి 24 : జిల్లాలోని వెంకటగిరిలో నూతన కారాగారం నిర్మించనున్నారు. గతంలో ఉన్న జైలును మూసివేయగా అందులో కోర్టు భవనం నిర్మించడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఐక్యరాజ్య సమితి ప్రమాణాలకు అనుగుణంగా నూతన జైలును నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మహమ్మద్‌ హసన్‌ రెజా బుధవారం వెంకటగిరిలో పర్యటించారు. కొత్త కారాగారం కోసం రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన యాచసముద్రం గ్రామములోని స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వెంకటాచలం మండలంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని జైళ్ల శాఖకు చెందిన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలములో జైళ్లశాఖ నిర్మించబోయే పునరావాస కేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న వర్మికంపోస్ట్‌ యూనిట్‌ పనితీరును పరిశీలించారు. వర్మి కంపోస్ట్‌ ఉత్పత్తిని పెంచేందుకు పలు సూచనలు చేశారు. జైలు కిచెన్‌లో స్టీమ్‌ కుకింగ్‌ సిస్టమ్‌ను డీజీ ప్రారంభించారు.  కోవూరు పోలీసు స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా స్థలాన్ని ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఈ కార్యక్రమాల్లో కడప రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎం వరప్రసాద్‌,  కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి కే రాజేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి మహేష్‌ బాబు, జిల్లా సబ్‌ జైల్‌ అధికారి ఎస్‌ వెంకటేశ్వరరావు, జైలర్‌ కేవీ రామారావు, వెంకటగిరి తహసీల్దారు బీ కాంతారాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T07:28:38+05:30 IST