Sep 25 2021 @ 12:47PM

ఈ ఫొటోలో హీరో అజిత్ పక్కన ఉన్న ఆమె ఎవరో తెలుసా..?

తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్రహీరోల్లో తల అజిత్ కుమార్ ఒకరు. సినిమాలతోపాటు క్రీడలు, రేసింగ్, సైక్లింగ్ అంటే అజిత్‌కు ఎంతో ఇష్టం. సమయం దొరికినపుడు బైక్ మీద ఒంటరిగా వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. అలాగే రేస్ కోర్టుల్లో కూడా తరచుగా కనిపిస్తుంటారు. అజిత్ తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మహిళా బైక్ రేసర్ మరల్ యాజార్లూను ఢిల్లీలో కలిశారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. 


బైక్‌పై ప్రపంచ యాత్ర చేయాలనేది అజిత్ కోరిక. అందుకు సిద్ధమవుతున్నారు కూడా. మరల్ ఇప్పటికే ఇలాంటి యాత్ర చేశారు. ఏడు ఖండాల్లోని 64 దేశాలను బైక్‌పై ఒంటరిగా చుట్టేశారు. ఈ నేపథ్యంలో మరల్‌ను అజిత్ కొన్ని టిప్స్ అడిగినట్టు సమాచారం. అజిత్ ప్రస్తుతం వినోద్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `వాలిమై`లో నటిస్తున్నారు. తెలుగు హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.