మార్చి.. ఏమార్చి!

ABN , First Publish Date - 2020-09-11T08:41:17+05:30 IST

కొత్త పథకం అంటే పాత దానికంటే ఎంత గొప్పగా ఉంటుందో అనుకొంటాం. కొత్తగా చేకూర్చే లబ్ధి, ఆయా వర్గాలకు కలిగే అదనపు ఆనందం గురించి ఆలోచిస్తాం. కానీ, జగన్‌ సర్కారు అమలు చేస్తున్న

మార్చి.. ఏమార్చి!

  • పాత పథకాలకే కొత్త పేర్లు
  • ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయింపు ఉండదు
  • కార్పొరేషన్‌ పద్దులోనే ఆసరా, ఇతర పథకాలు
  • ఇచ్చేదానిలోనూ ఎన్నో కోతలు, ఆంక్షలు
  • ‘పసుపు కుంకుమ’లో ప్రతి డ్వాక్రా మహిళకు లబ్ధి
  • నేడు ‘ఆసరా’గా తెస్తున్న అదే స్కీంలో చిక్కులు
  • ఎక్కువ రుణం ఉంటేనే కొంత ఊరట
  • ముందే కట్టేస్తే పైసా మేలు జరగదు
  • కాపు నేస్తం పథకంలోనూ కనికట్టు
  • టీడీపీ హయాంలో ఒక్కొక్కరికీ రూ.60 వేలు
  • నేడు అదే మొత్తం నలుగురికి సర్దుబాటు
  • దళిత పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి
  • ప్రోత్సాహకంలో భారీగా కోత 


‘ఆసరా’తో... ఎక్కువ బ్యాంకు రుణాలు ఉన్న డ్వాక్రా మహిళలకే ఎక్కువ మేలు. ‘రుణ భారం ఎందుకులే..’ అని ముందే కట్టేసిన వారికి పైసా లాభం ఉండదు. 

స్వయం ఉపాధి కింద లబ్ధిదారులను ఎంపికచేసి రూ.30 వేల నుంచి రూ.లక్ష చొప్పున రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు దానిని ఎత్తేసి, ‘కాపునేస్తం’ తెచ్చారు. నలుగురికి రూ.15 వేల చొప్పున పంచుతున్నారు!

 పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న దళితులు, ఔత్సాహికులకు పెట్టుబడి ప్రోత్సాహకం కింద 45 శాతం ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం దానిని ఎస్సీ, ఎస్టీ పురుషులకు 15 శాతానికి తగ్గించేసింది. అదే వర్గంలోని మహిళలకు 35 శాతానికి కోసేసింది. పైగా పెట్టుబడి ప్రోత్సాహకాల చెల్లింపు మూడేళ్ల తర్వాతే ఉంటుందని గతంలో లేని కొత్త షరతు పెట్టింది.



ఇదేం ఆసరా?

పాత లాభం పోయి  ‘కొత్త’ నష్టం

శుక్రవారం ప్రారంభిస్తున్న ‘ఆసరా’ పథకం గత ప్రభుత్వ హయాంలో అమలైన ‘పసుపు కుంకుమ’ లాంటిదే. అప్పట్లో ప్రతి డ్వాక్రా మహిళకూ లబ్ధి చేకూరింది. ఇప్పుడు... అప్పు ఎక్కువ ఉన్న వారికే ఎక్కువ లబ్ధి. పైగా... ఆసరా కోసం  ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించలేదు. కులాలు, వర్గాల వారీగా కేటాయించిన కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులనే ఈ పథకానికీ వినియోగించనున్నారు. దీనివల్ల ఆయా వర్గాలకు కార్పొరేషన్‌ ద్వారా అందాల్సిన స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఆయా 

పథకాలకు కోత తప్పదు. ఒకసారి కేటాయించిన నగదునే వైసీపీ ప్రభుత్వం అటు కార్పొరేషన్‌ 

నిధులుగానూ, ఇటు ఆసరా నిధులుగానూ 

చూపిస్తుందన్న మాట! ఇదీ... స్కీమ్‌


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

కొత్త పథకం అంటే పాత దానికంటే ఎంత గొప్పగా ఉంటుందో అనుకొంటాం. కొత్తగా చేకూర్చే లబ్ధి, ఆయా వర్గాలకు కలిగే అదనపు ఆనందం గురించి ఆలోచిస్తాం. కానీ, జగన్‌ సర్కారు అమలు చేస్తున్న అనేక పథకాల పేర్లు మాత్రమే కొత్తవి. వాటి తీరు మాత్రం పాతదే! పైగా... కొన్నింటిని కుదించి, ఇంకొన్నింటిని కత్తిరించి.. కొత్త ట్యాగ్‌ తగిలించేస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో వేర్వేరుగానూ, కలిసీ అమలుచేస్తూ వచ్చిన పథకాలనే అటుమార్చి, ఇటుమార్చి పేదలను, బడుగులను ఏమార్చడమే కొత్త సర్కారు నయా ‘పథకం’! చేనేతలు, కాపులు, క్షురకులు, దర్జీలు, దళితులు, బీసీలు, బ్రాహ్మణులు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసింది. వాటికే ఈ ప్రభుత్వం ‘కాపు నేస్తం’, ‘నేతన్న నేస్తం’.. అంటూ కొత్త సోకులు చేస్తోంది. ఈ కోవలోదే ‘ఆసరా’ పథకం కూడా! టీడీపీ ప్రారంభించిన పసుపు కుంకుమ పథకానికి పేరు మార్చి స్వల్పమార్పులతో దానికే వైసీపీ ప్రభుత్వం ‘ఆసరా’ అని పేరు పెట్టింది. శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం నిబంధనలు, ఉద్దేశం, ప్రయోజనం.. ఇలా ఎటుచూసినా టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ‘పసుపు కుంకుమ’కూ, దీనికీ దగ్గర పోలికలు ఉన్నాయి.


పెళ్లయిన ఆడపిల్లకు పుట్టింటివారు పసుపు కుంకుమ కింద కొంత మొత్తం ఇస్తారు. పుట్టింటివారి బాధ్యతను నాటి ప్రభుత్వం తీసుకొని అమలుచేసిన పథకమే ‘పసుపు కుంకుమ’. దీనికింద ప్రతి డ్వాక్రా మహిళకు ఏడాదికి రూ.10వేలు చొప్పున రెండేళ్లపాటు అందించారు. తిరిగి చెల్లించనక్కర్లేని పద్ధతిలో ఇచ్చిన ఈ సొమ్మును డ్వాక్రా మహిళలు పెట్టుబడి నిధి కింద స్వయం ఉపాధికి ఉపయోగించుకున్నారు. ఎన్నికలు జరిగి మారిన కొత్త ప్రభుత్వం అదే పథకాన్ని ‘ఆసరా’గా మార్పుచేసింది. పోలింగ్‌ తేదీ నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని చెల్లిస్తామని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈలోగా మహిళలు రుణాలు చెల్లించినప్పటికీ ఆ నగదు తిరిగి మహిళల ఖాతాల్లో వేస్తామనీ చెప్పారు. అధికారంలోకి వచ్చాక మొత్తం రుణాన్ని నాలుగు భాగాలు చేసి తొలి విడతగా 25శాతం నగదును ఆయా గ్రూపులకు ఉన్న రుణం ఆధారంగా విభజించారు. ఆ మొత్తాలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో శుక్రవారం వేయనున్నారు. ఈ పథకం నిబంధనలు చూస్తే, వారికి ఉన్న రుణాలను బట్టి లబ్ధి మోతాదు నిర్ణయమవుతుంది. ఎక్కువ రుణాలు ఉన్నవారికి ఎక్కువ మేలు జరుగుతుంది. ముందే కట్టేసిన వారికి ‘ఆసరా’ వల్ల పైసా లాభం ఉండదు. కానీ టీడీపీ ప్రభుత్వం పసుపుకుంకుమను ఇలా అమలుచేయలేదు. రుణాలు ఉంచుకొన్నారా, కట్టేసుకొన్నారా అనేది చూడకుండా ప్రతి డ్వాక్రా మహిళకు సంతోషం కలిగించేలా దాన్ని అమలు చేసింది. 


ఉన్నవి తీసేసి, కోతేసి.. కొత్త పేర్లు

కొత్తగా చేసే లబ్ధి ఏదీ లేకపోయినా పేర్లు మార్చి ప్రజలను ఏమారుస్తారు. నాలుగు పథకాలుంటే అన్నీ ఎత్తేసి, కొత్తగా తెచ్చిన ఒక్క పథకం ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూర్చి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం అన్ని పథకాల్లోనూ ఇదే బాట పట్టింది. ఉదాహరణకు కాపు కార్పొరేషన్‌నే తీసుకుంటే ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఏడాది కాలంలోనే ఏకంగా రూ.4,700 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించేసింది. స్వయం ఉపాధి లేదు.. నైపుణ్య శిక్షణ లేదు.. విదేశీ విద్య లేదు.. అయినా ఇవన్నీ ఎక్కడ ఖర్చు చేశారు అనే సందేహం అందరిలోనూ కలిగింది. తీరా ప్రభుత్వం దాని లెక్కలు వెల్లడించేటప్పటికీ అసలు మతలబు అర్థమైంది. గతంలో స్వయం ఉపాధి కింద లబ్ధిదారులకు ఎంపిక చేసి రూ.30వేల నుంచి రూ.లక్ష వరకూ రాయితీ ఇచ్చేవారు.


ఇప్పుడు దానిని ఎత్తేసి అదే నగదును ‘కాపునేస్తం’ కింద ఇస్తున్నారు. గతంలో సగటున స్వయం ఉపాధికి కింద ఒక్కొక్కరికి రూ.60వేలు రాయితీ ఇచ్చేవారు. దానినే ఇప్పుడు కాపునేస్తం కింద రూ.15వేలు చొప్పున నలుగురికి పంచుతున్నారు. అయితే గతంలో కొందరికి ఎక్కువ నగదు ఇచ్చినా, అది స్వయం ఉపాధికి దోహదం చేసేది. గేదెలు, కిరాణా షాపులు, టైలరింగ్‌ యూనిట్లు, ఆటోలు ఇలా స్థిరమైన ఉపాధి అవకాశం ఉండేది. ఇప్పుడు అదే నగదును తలా కొంత పంచడంతో ఏ విధంగానూ అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇదే తంతు అన్ని కార్పొరేషన్ల పథకాల్లోనూ అమలవుతోంది.

Updated Date - 2020-09-11T08:41:17+05:30 IST