Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 18 Jun 2021 01:47:07 IST

పుట్టినరోజున కొత్త సినిమా

twitter-iconwatsapp-iconfb-icon

తమిళనాట మళ్లీ షూటింగ్స్‌ సందడి మొదలుకానుంది. సెట్‌ మీదకు మళ్లీ తమ సినిమాలను తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. హీరో విజయ్‌ నటిస్తున్న 65వ చిత్రం రెండో షెడ్యూల్‌ ప్రారంభించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ జార్జియాలో జరిగింది. రెండో షెడ్యూల్‌ ప్రారంభించడానికి కరోనా వైరస్‌ అడ్డం పడింది. ఈ సినిమా కోసం చెన్నైలో భారీ మాల్‌ సెట్‌ వేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీ్‌పకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న విజయ్‌ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement