‘పల్లె’కు కొత్త ‘వెలుగు’

ABN , First Publish Date - 2021-10-29T05:44:11+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు మూడు వేల పల్లె వెలుగు బస్సులను నవీకరించి ఆర్టీసీవైపు ప్రజలను ఆకర్షిస్తామని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన ఒంగోలు బస్‌స్టేషన్‌ను సందర్శించారు. ప్రయాణికులను సదుపాయాలపై ఆరా తీయడంతో పాటు పార్శిల్‌ కార్యాలయాన్ని, వైద్యశాలను తర్వాత డిపోను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్‌ సర్వీసులకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు.

‘పల్లె’కు కొత్త ‘వెలుగు’
ఒంగోలు డిపోలో తనిఖీలు చేస్తున్న ఎండీ ద్వారకా తిరుమలరావు

 ఆర్డ్డినరీ బస్సులను నవీకరిస్తాం

కార్గో సర్వీసులకు ఆదరణ పెరిగింది

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 28: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు మూడు వేల పల్లె వెలుగు బస్సులను నవీకరించి ఆర్టీసీవైపు ప్రజలను ఆకర్షిస్తామని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన ఒంగోలు బస్‌స్టేషన్‌ను సందర్శించారు. ప్రయాణికులను సదుపాయాలపై ఆరా తీయడంతో పాటు పార్శిల్‌ కార్యాలయాన్ని, వైద్యశాలను తర్వాత డిపోను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్‌ సర్వీసులకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. రోజుకు 450 పార్శిల్స్‌ ఇక్కడ నుంచి వెళతాయని, 650వరకు  వస్తాయని, అవన్నీ వేగంగా డెలివరీ అవుతున్నాయని వివరించారు. డోర్‌ డెలివరీ అనేది ఆప్షన్‌ మాత్రమేనని, వినియోగదారుడు ఇష్టమైతే ఎంపిక చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా పార్శిల్స్‌లో ఉన్న సరుకుకు నష్టం వాటిల్లితే సంస్థే పరిహారం అందిస్తుందన్నారు. ఇది కేవలం ఆర్టీసీలో మాత్రమే సాధ్యమన్నారు. ఉన్న వనరుల ద్వారానే ఆదాయం పెంచుకునే మార్గంపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు. బస్సులను పెంచడం కన్నా షెడ్యూలే కీలకమన్నారు. బస్టాండ్‌ ఆవరణల్లో ఉన్న ఖాళీస్థలాలను లీజుకిచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈడీ గోపీనాథ్‌రెడ్డి, సీటీఎం బ్రహ్మనందరెడ్డి, డీఎం శ్రీనివాసరావు, ఆర్‌ఎం సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:44:11+05:30 IST